Site icon NTV Telugu

Blood Falls: రక్తం ఏరులై పారుతోంది.. ఎక్కడో తెలుసా ?

New Project (9)

New Project (9)

Blood Falls: ప్రకృతిలో ఎన్నో వింతలు విశేషాలున్నాయి. శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు ఆ రహస్యాలను అన్వేషిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే ఓ నెత్తుటి నది వారి కంట పడింది. దానిపై వారి పరిశోధనలు మొదలయ్యాయి. తెల్లటి మంచుతో కప్పబడిన ఖండం అంటార్కిటికా. నెలల తరబడి ఆ ఖండంపై సూర్యకాంతి పడదు. అయితే ఇక్కడ రక్త నది ప్రవహిస్తోంది. దీనినే బ్లడ్ ఫాల్స్ రివర్ అంటారు. భూమి దక్షిణ భాగంలో ఉన్న ఈ ఖండంలో ఎక్కువ భాగం మంచే ఉంటుంది. తెల్లటి దుప్పటి కప్పుకున్న ఈ జలపాతంలో రక్తపు నీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ నెత్తుటి జలపాతంపై రకరకాల పుకార్లు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు బ్లడ్ ఫాల్స్ రివర్ మిస్టరీ వెలుగులోకి వచ్చింది.

Read Also:WPL 2023 : అప్పుడు వాళ్లు.. ఇప్పుడు వీళ్లు చరత్ర రిపీట్ అవుతుందా?

యూకే వెబ్‌సైట్ డైలీ స్టార్ కథనం ప్రకారం.. ఇటీవల యూనివర్సిటీ ఆఫ్ అలస్కా ఫెయిర్‌బ్యాంక్స్ పరిశోధకులు ఈ నది మిస్టరీని ఛేదించడంలో విజయం సాధించారు. ఈ జలపాతాన్ని తొలిసారిగా 1911లో ఆస్ట్రేలియా శాస్త్రవేత్త థామస్ గ్రిఫిత్ టేలర్ కనుగొన్నారు. ఈ సరస్సు వయస్సు సుమారు 1.5 మిలియన్ సంవత్సరాలు. ఈ లోయలో ఐరన్‌ కంటెంట్‌తో కూడిన ఉప్పునీరు ఉండటమే ఇందుకు కారణమని పరిశోధకులు చెబుతున్నారు. ఆక్సీకరణ కారణంగా నది నీరు రక్తం ఎరుపుగా కనిపిస్తుంది. ఈ సరస్సులో వెలుతురు, ఆక్సిజన్ లభ్యత చాలా తక్కువగా ఉంటుందని చెబుతున్నారు.

Read Also:Donald Trump: నన్ను టచ్ చేస్తే విధ్వంసమే.. ట్రంప్ వార్నింగ్..

ఐరన్ ద్రవం గాలిలోని ఆక్సిజన్‌తో తాకినప్పుడు నీరు రక్తం ఎరుపు రంగులోకి మారుతుంది. ఏళ్ల తరబడి ఈ ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతోంది. ఈ బ్లడ్ ఫాల్స్ ఎత్తు ఐదు అంతస్తుల భవనంతో సమానం. ఎర్త్ స్కై నివేదిక ప్రకారం, బ్లడ్ ఫాల్స్ నీటిలో ఆక్సిజన్ లేదని పరిశోధన తర్వాత పరిశోధకుల బృందం కనుగొంది. కానీ 17 రకాల సూక్ష్మజీవులు ఉన్నాయి. సల్ఫేట్ తగ్గింపు ద్వారా శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ సూక్ష్మజీవులు చాలా క్లిష్టమైన వాతావరణంలో జీవిస్తాయి.

Exit mobile version