వేసవి సెలవుల మజా ముగింపు దశకు చేరుకుంది. నెలన్నర విరామం తర్వాత బడిగంటలు ఇవాళ్టి నుంచి మోగనున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం 41 వేల స్కూళ్లు, గురుకులాలు, వసతిగృహాలు తిరిగి తెరుచుకోనున్నాయి. దీంతో దాదాపు 60 లక్షల మంది స్టూడెంట్స్ తిరిగి బడిబాటపట్టనున్నారు. ఇన్నాళ్లు సెలవులు ఎంజాయ్ చేసిన.. విద్యార్థులు తమ ఆటలు పాటలతో గడిపిన చిన్నారులంతా ఇవాళ్టి నుంచి చదువుల ప్రపంచంలోకి అడుగుపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ బడులను మరింత బలోపేతం చేసే, విద్యా ప్రమాణాలను పెంపొందించేందుకు పాఠశాల విద్యాశాఖ పటిష్ఠ కార్యాచరణను సిద్ధం చేసింది.
Read Also : Australia : ఆస్ట్రేలియాలో భారీ రోడ్డు ప్రమాదం.. పెళ్లి బస్సు బోల్తా 10 మంది మృతి
నూతన విద్యాసంవత్సరంలో చేపట్టే కార్యక్రమాలతో పాఠశాల విద్య, సమగ్ర శిక్ష, స్టేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ టెక్నాలజీలకు అధికారులు వేర్వేరు ప్రణాళికలను రూపొందించారు. వాటిని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి ఆమోదం వేశారు. గత సంవత్సరం 1-8 తరగతుల్లో ఆంగ్ల మాధ్యమ బోధనను ప్రవేశపెట్టిన ప్రభుత్వం.. ఈసారి దాన్ని 9వ తరగతికి విస్తరిస్తున్నట్లు పేర్కొంది.
Read Also : Vikarabad Sireesha Case: వీడిన శిరీష హత్య కేసు మిస్టరీ.. వెలుగులోకి సంచలన విషయాలు
అయితే పాఠశాలల సెలవులను 19వ తేదీ వరకు పొడిగించారని వస్తున్న వార్తలు అవాస్తవమని, సెలవులను ప్రభుత్వం పొడిగించలేదని విద్యాశాఖ కార్యదర్శి స్పష్టం చేశారు. తుఫాను, భారీ వర్షాల నేపథ్యంలో సెలవులు పొడించారంటూ సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్న సర్క్యూలర్ ఫేక్ అని విద్యాశాఖ అధికారులు ఓ ప్రకటనను విడుదల చేశారు. ఇక నేటి నుంచే పాఠశాలలు పునఃప్రారంభమవుతున్నాయి. తొలి రోజు పాఠశాలలకు వెళ్లేందుకు విద్యార్థులు సిద్ధమవుతున్నారు. సమ్మర్ హాలిడేస్ తర్వాత బడులకు వెళ్లేందుకు స్టూడెంట్స్ ఉత్సాహం చూపిస్తున్నారు.