NTV Telugu Site icon

Schools Reopen: ఈ నెల 12 నుంచి తెలంగాణలో స్కూల్స్ రీ ఓపెన్

Schools Reopen

Schools Reopen

Schools Reopen in Telangana: తెలంగాణలో పాఠశాలల పునఃప్రారంభానికి సమయం దగ్గర పడింది. 2023 జూన్‌ 12 సోమవారం రోజు నుంచి స్కూళ్లు రీ ఓపెన్‌ కానున్నాయి. అంటే వేసవి సెలవులకు ఇంకా మూడు రోజుల సమయం మాత్రమే ఉందన్నమాట. దాదాపు రెండు నెలల పాటు విద్యార్థులు సమ్మర్ హాలీడేస్ ను ఎంజాయ్ చేశారు. వేసవి సెలవులు ముగుస్తుండటంతో విద్యార్థులు తమ సొంత పట్టణాలకు చేరుకుంటున్నారు. సెలవులు పొడిగిస్తారనే వార్తల నేపథ్యంలో.. పొడిగింపు లేదని అధికారులు ప్రకటించారు. ఈ నెల 12 నుంచి స్కూల్స్ రీఓపెన్‌ అవుతాయని.. విద్యార్థులు పాఠశాలలకు హాజరవ్వాలని విద్యాశాఖ అధికారులు ప్రకటించారు.

Read Also: Revanth Reddy: కేసీఆర్, కేటీఆర్‌కు రేవంత్ సవాల్‌.. దమ్ముంటే వాళ్లకు సీట్లివ్వండి..

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE)కి అనుబంధంగా ఉన్న పాఠశాలలు ఇప్పటికే మార్చి, ఏప్రిల్ నెలల్లో 2023-24 విద్యా సంవత్సరాన్ని ప్రారంభించగా.. రాష్ట్ర బోర్డుచే గుర్తింపు పొందిన పాఠశాలలు జూన్ 12 నుండి విద్యా సంవత్సరాన్ని ప్రారంభిస్తాయి. కాగా స్కూళ్లకు 2023 ఏప్రిల్ 25 నుంచి వేసవి సెలవులు ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇదిలావుండగా.. జూన్ 1 నుండి 9 వరకు ప్రభుత్వ పాఠశాలల్లో బడి బాట (అడ్మిషన్ డ్రైవ్)ను విద్యాశాఖ నిర్వహించింది. ఇందులో భాగంగా ఉపాధ్యాయులు ఇంటింటికీ ప్రచారం నిర్వహించి బడి మానేసిన పిల్లలను గుర్తించి వారిని బడిలో చేర్పించాలని సూచించారు. బడి మానేసిన పిల్లలు లేదా చదువు మానేసిన విద్యార్థులను కూడా గుర్తించి వారి వయస్సు ప్రకారం తగిన తరగతిలో పాఠశాలల్లో చేర్పించాలని పిల్లలకు తల్లిదండ్రులకు చెప్పారు.