NTV Telugu Site icon

Viral Video : స్టూడెంట్స్ తో కలిసి డ్యాన్స్ అదరగొట్టిన టీచర్స్.. వావ్ సూపర్ కదా..

Dance Teacher

Dance Teacher

స్టూడెంట్స్ తో కలిసి టీచర్స్ డ్యాన్స్ వెయ్యడం కామన్.. సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోలు ఎక్కువగా దర్శనం ఇస్తున్నాయి.. తాజాగా మరో వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఆ వీడియోలో చీరలో ఉన్న టీచర్ పాట వినగానే అన్నీ మర్చిపోయి చిన్న పిల్లలా ఎంజాయ్ చేస్తూ డ్యాన్స్ చేసింది.. అందుకు సంబందించిన వీడియోనే ఇది..

టీచర్ చీర కట్టుకుని తన విద్యార్థులతో కలిసి డ్యాన్స్ చేస్తున్న వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌గా మారింది. కాజల్ అసుదాని ఒక వారం క్రితం తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా (@kajalasudanii)లో వీడియోను పంచుకున్నారు.. 16 మిలియన్స్ వ్యూస్ ను సంపాదించింది.. ఈ సంవత్సరం వైరల్ అవుతున్న కుమావోని పాట ‘గులాబీ షరారా’ పాటకు ఉపాధ్యాయుడు నలుగురు విద్యార్థినులు కూడా ఆమెతో కాలు కదిలించారు.

తనకు వచ్చిన స్పందనకు కృతజ్ఞతలు అని అసుదాని క్యాప్షన్‌లో రాశారు. తాను బోధించే సమయంలో కఠినంగా ఉంటానని, విద్యార్థులతో కలిసి ఎంజాయ్‌ చేయడంలో కూడా తనకు నమ్మకం ఉందని చెప్పింది. పాఠశాలలో వార్షిక సమావేశం సందర్భంగా వీడియో రికార్డ్ చేసినట్లు అసుదానీ చెప్పారు. చదువుతో పాటు పాఠ్యేతర కార్యకలాపాలు విద్యార్థులను ‘ఓవరాల్ పెర్ఫార్మర్స్’గా మారుస్తాయని తాను నమ్ముతున్నానని ఆమె అన్నారు. ఈ వీడియోను విద్యార్థులు కోరారని, వారి అంగీకారంతో తీశారని ఆమె తెలిపారు.. ఆ వీడియోనే ఇప్పుడు ట్రెండ్ అవుతుంది..మా విద్యార్థులను ఉత్సాహంగా ఉంచడానికి మేము ఉపాధ్యాయులు కూడా కొన్ని సమయాల్లో ఎంటర్‌టైనర్‌గా ఉండాలి’ అని ఒక వినియోగదారు వ్యాఖ్యానించారు. ‘ఒకరు ఫిజిక్స్ టీచర్ ఇష్టంగా చేశారని చాలా బాగా చేశారని కామెంట్ చేశారు.. టీచర్ డ్యాన్స్ వీడియో ను ఒకసారి చూడండి..