చిన్న చిన్న అంశాలు చాలా పెద్ద వివాదాలకు దారితీస్తుంటాయి. చినికి చినికి గాలివానగా మారడం అంటే ఇదే. ప్రకాశం జిల్లా, గిద్దలూరులో ఓ ప్రైవేటు స్కూలు యాజమాన్యంకు, లీజుదారునికి మధ్య గొడవలు తారస్థాయికి చేరాయి. దీని ఫలితం స్కూలు మూసివేతకు దారితీశాయి. గిద్దలూరు పట్టణ సమీపంలో ఉన్న చాణక్య ప్రైవేట్ స్కూలును గత నాలుగేళ్ళ క్రితం వేరే వ్యక్తి లీజుకు తీసుకుని రాయల్ స్కూలుగా పేరు మార్చి నడుపుతున్నాడు. ఈ సంవత్సరం స్కూలు యాజమాన్యానికి, లీజుదారునికి మధ్య డబ్బు విషయంలో గొడవలు జరిగాయి. చాలామంది విద్యార్థులు మధ్యలోనే వేరే స్కూళ్లల్లో చేరిపోయారు.
Read Also: Gopichand Malineni: శృతి హాసన్ తో ఎఫైర్.. గోపీచంద్ ఏమన్నాడంటే..?
అయితే సంక్రాంతి సెలవులు ముగిసినా కూడా ఈరోజు లీజుదారుడు స్కూల్ తెరవలేదు. దీనితో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెంది జిల్లా విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేసారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని విద్యాసంవత్సరం నష్టపోకుండా విద్యార్థులను సమీప ప్రభుత్వ పాఠశాలల్లో చేరుస్తామని విద్యాశాఖ అధికారులు తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు. మూసివేసిన స్కూలుపై విచారించి చర్యలు తీసుకుంటామన్నారు. స్కూలు యాజమాన్యం, లీజుదారుల గొడవలతో విద్యార్ధుల భవిష్యత్ అయోమయానికి గురవుతున్నారు.
Read Also: Cm Jagan Mohan Reddy: ఉన్నత విద్యాశాఖపై సమీక్ష.. . ఐటీ, స్కిల్ డెవలప్ మెంట్ పై జగన్ ఫోకస్