NTV Telugu Site icon

CM YS Jagan: రేపటి సీఎం జగన్‌ ప్రచార సభల షెడ్యూల్ ఇదే..

Jagan

Jagan

CM YS Jagan: మరోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతోంది వైసీపీ. నోటిఫికేషన్ వచ్చిననాటి నుంచి నిరంతరాయంగా ప్రచారంలో దూసుకుపోతుంది. ఇప్పటికే సిద్ధం, మేమంతా సిద్ధం బస్సుయాత్రతో రాష్ట్రాన్ని చుట్టేసిన వైసీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరో ఎన్నికల ప్రచార భేరి మోగించారు. నేడు తాడిపత్రి, వెంకటగిరి, కందుకూరులో సీఎం జగన్‌ ప్రచార సభల్లో పాల్గొన్న సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచార సభల 29వ తేదీ షెడ్యూల్‌ను పార్టీ విడుదల చేసింది.

Read Also: AP Weather: ఏపీ ప్రజలకు అలర్ట్.. రేపు 47 మండలాల్లో తీవ్ర వడగాల్పులు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై ఎస్ జగన్మోహన్ రెడ్డి 29 వ తేదీన ఎన్నికల ప్రచారాన్ని మూడు నియోజకవర్గాల్లో నిర్వహిస్తారు. సోమవారం ఉదయం 10 గంటలకు అనకాపల్లి జిల్లా చోడవరంలో కొత్తూరు జంక్షన్‌లో జరిగే ప్రచార సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12.30 గంటలకు అమలాపురం పార్లమెంట్ పరిధిలో పి గన్నవరం నియోజకవర్గంలో అంబాజీపేట బస్టాండ్ రోడ్ లో జరిగే సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గంటలకు గుంటూరు పార్లమెంట్ పరిధిలోని పొన్నూరు ఐలాండ్ సెంటర్ లో జరిగే ప్రచార సభలో పాల్గొంటారు. ప్రచార సభల కోసం వైసీపీ నేతలు అన్ని ఏర్పాట్లు చేశారు.