Shock for Food Lovers: ఫుడ్ లవర్స్ కు ప్రపంచంలోని ఫేమస్ రెస్టారెంట్ షాక్ ఇచ్చింది. త్వరలోనే మూసేస్తున్నట్లు ప్రకటించింది. కరోనా మహమ్మారి నియంత్రణకు విధిస్తున్న లాక్‌డౌన్ కారణంగా రెస్టారెంట్ మూసివేయబడుతుందని సంస్థ ప్రకటించింది.ఇది ఆహార ప్రియులను షాక్‌కు గురి చేసింది. డెన్మార్క్‌లోని కోపెన్‌హాగన్‌లో ఉన్న అత్యంత ప్రసిద్ధ నోమా రెస్టారెంట్ వచ్చే 2024 నుండి మూసివేయబడుతుంది. 2003లో చెఫ్ రెనే రెడ్‌జెపిచే స్థాపించబడిన ఈ రెస్టారెంట్ చాలా సంవత్సరాలుగా ప్రపంచంలోని అత్యుత్తమ రెస్టారెంట్‌ల జాబితాలో అగ్రస్థానంలో ఉంది. బ్రిటీష్ మ్యాగజైన్ రెస్టారెంట్లు ప్రతి సంవత్సరం ప్రపంచంలోని 100 ఉత్తమ రెస్టారెంట్ల పేర్ల జాబితా విడుదల చేస్తుంది.
Read Also: Pak praising India: భారత్‌ను తెగపొగిడేస్తున్న పాకిస్తాన్ పత్రికలు
నోమా రెస్టారెంట్ ఐదు సార్లు ఆ జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది.అలాగే,2021లో ప్రచురించబడిన ప్రపంచంలోని 50 అత్యుత్తమ రెస్టారెంట్‌ల జాబితాలో నోమా రెస్టారెంట్ మొదటి స్థానంలో నిలిచింది.ఈ విధంగా, కరోనా సంక్షోభం సమయంలో సంభవించిన లాక్‌డౌన్ సమస్యల కారణంగా 2021లో బాగా ప్రాచుర్యం పొందిన నోవా రెస్టారెంట్ భారీ నష్టాన్ని చవిచూసింది.తద్వారా నోమా రెస్టారెంట్ భవనం రానున్న 2025లో ఆహార ఆవిష్కరణల కోసం భారీ ల్యాబొరేటరీగా మారుతుందని చెబుతున్నారు.నోమా యజమానులు రెగ్యులర్ సర్వీస్ కోసం మాత్రమే రెస్టారెంట్‌ను మూసివేయాలని ప్లాన్ చేస్తున్నారు. దానిని ఫుడ్ ల్యాబ్‌గా మార్చాలని చూస్తున్నారు దాని యజమాని రెనే రెడ్జెపి.ఇది ఇక పై చెఫ్‌లకు శిక్షణ ఇవ్వడం, తనదైన బ్రాండ్ వంటకాలను రూపొందించడం లక్ష్యంగా కొత్త ప్రాజెక్ట్ చేపట్టనుంది.