Scam Alert: మరో కొత్త తరహా మోసాలు.. జీమెయిల్ యూజర్లే లక్ష్యం!
- కొత్త విధానంలో మోసాలకు పాల్పడుతున్న సైబర్ నేరగాళ్లు
- జీమెయిల్ యూజర్లే లక్ష్యం
- పొరపాటున లింక్ క్లిక్ చేస్తే అంతే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gmail Account Recovery Scam: సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త విధానంలో మోసాలకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. కాల్స్, యూపీఐ చెల్లింపులు, గిఫ్ట్‌లు, పార్శిళ్ల పేరిట ఇప్పటికే ఎన్నో మోసాలకు పాల్పడ్డారు. ఇప్పుడు మరో కొత్త తరహా మోసాలకు తెరలేపారు. జీమెయిల్ యూజర్లే లక్ష్యంగా స్కాములకు పాల్పడుతున్నారు. ఫేక్ అకౌంట్ రికవరీ రిక్వెస్టులు పంపి యూజర్ల చేత ఆప్రూవ్ చేసుకునేందుకు ఎత్తుగడలు వేస్తున్నారు. పొరపాటున లింక్ క్లిక్ చేస్తే.. వ్యక్తిగత డేటా వారి చేతిలోకి వెలుతుంది. మీరు జీమెయిల్లో భద్రపరుచుకున్న సమాచారం అంతా వారికి తేలిపోతుంది.
ఐటీ కన్సల్టెంట్, టెక్ బ్లాగర్ సామ్ మిట్రోవిక్ తనకు ఎదురైన ఓ అనుభవాన్ని తెలిపారు. స్కామ్‌లో భాగంగా ముందుగా అకౌంట్ రికవరీ పేరిట మీ ఫోన్‌కు నోటిఫికేషన్ లేదా మీ జీమెయిల్‌కు మెయిల్ వస్తుంది. ఈ నోటిఫికేషన్ లేదా మెయిల్ వేరే దేశం నుంచి వస్తుంది. మిట్రోవిక్కు అమెరికా నుంచి ఈ రిక్వెస్ట్ వచ్చింది. ఒకవేళ ఆ నోటిఫికేషన్‌ను మీరు రిజెక్ట్ చేస్తే సైబర్ నేరగాళ్లు ప్లాన్-బి అమలు చేస్తారు. గూగుల్ నుంచి చేసినట్లు ఓ కాల్ వస్తుంది. తాను గూగుల్ ఉద్యోగిని అంటూ ఫోన్ చేసి నమ్మిస్తారు.
Also Read
- CJP Protest: సీజేపీ నిరసనలో తీవ్ర విషాదం.. ప్రొటెస్ట్‌కు వచ్చిన వ్యక్తి మృతి..
- India vs Pakistan: నేడే భారత్-పాకిస్థాన్ గోల్డ్ మెడల్ ఫైట్.. ఎవరి బలం ఎంత? పూర్తి విశ్లేషణ ఇదే..!
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
‘మీ అకౌంట్‌ను విదేశాల్లో ఎవరో వాడేందుకు ప్రయత్నించారు. నోటిఫికేషన్ లేదా మెయిల్‌ను యాక్సెప్ట్ చేసుంటే మీరు ప్రమాదంలో పడతారు’ అంటూ చెబుతారు. మరిన్ని విషయాలు కూడా చెప్పి భయపెడతారు. యూజర్‌ను నమ్మాక.. గూగుల్ పేరిట ఓ మెయిల్ పంపిస్తారు. నిజానికి అది ఫేక్ మెయిల్. ఒకవేళ లింక్ క్లిక్ చేస్తే.. మీ జీమెయిల్ ఖాతా పూర్తి యాక్సెస్ వారి చేతిలోకి వెళుతుందని మిట్రోవిక్ తెలిపారు. స్కాముల పట్ల యూజర్లు అవగాహన పెంచుకోవడం ద్వారానే ఇలాంటి వాటి నుంచి తపించుకోవచ్చని మిట్రోవిక్ చెప్పారు. అకౌంట్ రికవరీ పేరిట వచ్చే రిక్వెస్టులను ఆమోదించకూడదని, ఎవరైనా గూగుల్ పేరిట కాల్ చేస్తే నమ్మొద్దని చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Punjab Drug Menace: నడవలేక తూలిపడిన 19 ఏళ్ల యువతి.. ‘జాంబీ డ్రగ్’పై మళ్లీ ఆందోళనలు.. పోలీసుల యాక్షన్
-
CJP Protest: సీజేపీ నిరసనలో తీవ్ర విషాదం.. ప్రొటెస్ట్‌కు వచ్చిన వ్యక్తి మృతి..
-
India vs Pakistan: నేడే భారత్-పాకిస్థాన్ గోల్డ్ మెడల్ ఫైట్.. ఎవరి బలం ఎంత? పూర్తి విశ్లేషణ ఇదే..!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..