Site icon NTV Telugu

Margadarsi Case: మార్గదర్శి కేసులో రామోజీరావుకు సుప్రీంకోర్టు నోటీసులు

Supreme Court

Supreme Court

Margadarsi Case: మార్గదర్శి కేసులో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ దాఖలు చేసిన పిటిషన్‌పై రామోజీరావుకు సుప్రీంకోర్టు ధర్మాసనం నోటీసులు ఇచ్చింది. 4 వారాల్లో సమాధానం ఇవ్వాలని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. మార్గదర్శిలో చేసింది నేరమా కాదా అనేది వాదనలు కొనసాగనున్నాయని పిటిషనర్‌ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ తెలిపారు. సుప్రీంకోర్టులో ఈ కేసుపై సోమవారం విచారణ జరిగింది. కేసుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం తరపున వికాస్‌ సింగ్‌ వాదనలు వినిపించారు.

ఏపీ ప్రభుత్వం మార్గదర్శి కేసులో ప్రధాన పాత్ర పోషించబోతుందని ఉండవల్లి అరుణ్‌కుమార్ వెల్లడించారు. తెలంగాణ ముఖ్యమంత్రిని కూడా మార్గదర్శి కేసులో పిటిషన్ దాఖలు చేయాలని కోరడం జరిగిందన్నారు. రెండు నెలలు అవుతుంది తెలంగాణ ప్రభుత్వం ఇంకా వకాలత్ దాఖలు చేయలేదు. కేసీఆర్ చెప్పిన తర్వాత కూడా రెండు నెలల నుంచి పిటిషన్ దాఖలు చేయడం లేదు ఎందుకు ఆలస్యం అయిందో అర్థం కావడం లేదన్నారు.

MP Laxman: టీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి నాటకం ఆడుతున్నాయి

“మార్గదర్శి కేసులో రామోజీరావు కూడా సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఖాతాదారుల నుంచి డిపాజిట్లు ఎంతోమంది తీసుకుంటున్నారు వారిని ఒక విధంగా, రామోజీరావును ఒక విధంగా చూడొద్దని కోర్టును కోరడం జరిగింది.డిపాజిట్లు తీసుకోవడం నేరమా కాదా అనేది మాత్రమే కోర్టును అడుగుతున్నాం. ఎవరెవరు డిపాజిట్లు చేశారో వారి పేర్లు అన్ని కూడా నా దగ్గర ఉన్నాయి.” ఉన్నాయని పిటిషనర్‌ ఉండవల్లి స్పష్టం చేశారు.

Exit mobile version