NTV Telugu Site icon

Bilkis Bano Plea: బిల్కిస్ బానో అభ్యర్థన.. ప్రత్యేక ధర్మాసనాన్ని ఏర్పాటు చేసేందుకు సుప్రీం అంగీకారం

Bilkis Bano

Bilkis Bano

Bilkis Bano Plea: 2002 గుజరాత్ అల్లర్ల సమయంలో సామూహిక అత్యాచారానికి గురైన బిల్కిస్ బానో కేసులో 11 మంది దోషుల శిక్షను తగ్గించడాన్ని వ్యతిరేకిస్తూ బిల్కిస్ బానో వేసిన పిటిషన్‌ను విచారించేందుకు ప్రత్యేక బెంచ్‌ను ఏర్పాటు చేసేందుకు సుప్రీంకోర్టు బుధవారం అంగీకరించింది. ఆమె పిటిషన్‌ను విచారించేందుకు ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటు చేసేందుకు బుధవారం అంగీకరించింది. సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ ఈ మేరకు స్వయంగా బాధితురాలి తరపు న్యాయవాదికి ఈ విషయమై స్పష్టత ఇచ్చారు. సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ జేబీ పార్దివాలాలతో కూడిన ధర్మాసనం కొత్త బెంచ్‌ను ఏర్పాటు చేస్తామని ఆమె న్యాయవాది శోభా గుప్తా ద్వారా వాదించిన బానోకు హామీ ఇచ్చింది. బానో తరపున లాయర్‌ శోభా గుప్తా విజ్ఞప్తి మేరకు న్యాయస్థానం ఇందుకు అంగీకరించింది. “నేను బెంచ్‌ను ఏర్పాటు చేస్తాను. ఈ సాయంత్రం దానిని పరిశీలిస్తాను” అని సీజేఐ స్వయంగా శోభాగుప్తాకు చెప్పారు.

Read Also: ISRO Chief: చంద్రయాన్-3 క్రాఫ్ట్ సిద్ధం.. ఈ ఏడాది మధ్యలో ప్రయోగం!

2002 గుజరాత్‌ అలర్ల సమయంలో.. బిల్కిస్‌ బానో దారుణంగా సామూహిక అత్యాచారానికి గురైంది. అదే అల్లర్లలో బిల్కిస్ బానో కుటుంబంలోని ఏడుగురు కూడా మరణించారు. ఇక ఈ కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న పదకొండు మందిని.. గుజరాత్‌ ప్రభుత్వం కిందటి ఏడాది ఆగష్టు 15వ తేదీన రెమిషన్‌ కింద విడుదల చేసింది. దీనిని సవాల్‌ చేస్తూ గత డిసెంబర్‌లో బిల్కిస్‌ బానో సుప్రీంను ఆశ్రయించగా.. ఆ అభ్యర్థనను న్యాయస్థానం తోసిపుచ్చింది. ఇక.. ఈ ఏడాది జనవరి 24వ తేదీన సైతం ఆమె మరో పిటిషన్‌ దాఖలు చేయగా.. ఆ సమయానికి ఐదుగురు జడ్జిలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం మరో పిటిషన్‌తో బిజీగా ఉండడం వల్ల ముందుకు కదల్లేదు.