SBI Loans: ఎస్బీఐ ఖాతాదారులకు శుభవార్త.. UPI చెల్లింపుల ఆధారంగా కూడా రుణాలు మంజూరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతీయ స్టేట్ బ్యాంక్ (SBI) చిన్న వ్యాపారులకు రుణాలు అందించేందుకు ఒక నూతన విధానాన్ని తీసుకువస్తోంది. దీని ద్వారా వ్యాపారుల లోన్ అర్హతను యూపీఐ లావాదేవీల డేటా ఆధారంగా అంచనా వేస్తారు. ఎస్బీఐ మేనేజింగ్ డైరెక్టర్ అశ్విన్ కుమార్ తివారీ ఈ వివరాలను వెల్లడించారు. జీఎస్టీ (GST) రిజిస్ట్రేషన్ లేని చిన్న వ్యాపారులు, దుకాణదారులు, చిరు వ్యాపారులకు ఈ విధానం ద్వారా రుణాలు పొందడం సులభం అవుతుంది. చిన్న వ్యాపారాలలో క్రమం తప్పకుండా అమ్మకాలు జరిగి, ఆ పేమెంట్స్ అన్నీ యూపీఐ ద్వారా డిజిటల్ రూపంలో జరుగుతుంటే, ఆ లావాదేవీలను వ్యాపార విక్రయాలకు నిదర్శనంగా బ్యాంక్ పరిగణిస్తుంది.
ప్రస్తుతం జీఎస్టీ రిజిస్టర్డ్ వ్యాపారులకు ఎస్బీఐ కేవలం 10 నిమిషాల్లోనే రుణాలు ఇస్తోంది. గడిచిన 18 నెలల్లో జీఎస్టీ, పాన్ డేటా ఆధారంగా లక్ష కోట్ల రూపాయల లోన్లను బ్యాంక్ మంజూరు చేసింది. అయితే జీఎస్టీ నంబర్ లేని చిన్న వ్యాపారులకు రుణాలు ఇవ్వడంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఈ సమస్యను పరిష్కరించడానికే ఎస్బీఐ ఈ సరికొత్త యూపీఐ ఆధారిత పరిష్కారాన్ని రూపొందిస్తోంది.
Also Read
- Modi-Jinping: అరుదైన ఖనిజాలు, వాణిజ్య లోటు.. మోడీ-జిన్‌పింగ్ భేటీలో కీలకాంశాలు..
- Notification Cancelled: నిరుద్యోగులకు అలర్ట్.. TGPSC నుంచి విడుదలైన ఆ నోటిఫికేషన్ రద్దు..
- Botsa Satyanarayana Emotional: మరోసారి బొత్స కన్నీళ్లు.. అమర్నాథ్ వ్యాఖ్యలతో కన్నీటి పర్యంతం
- Saudi Arabia Oil: హోర్ముజ్ తర్వాత మరో షాక్.. మూతపడ్డ సౌదీ చమురు పైప్‌లైన్.. భారత్‌కు పెరిగిన కష్టాలు!
యూపీఐ చెల్లింపుల విషయంలో ఎవరికి డబ్బు వెళుతుందనే పూర్తి స్పష్టత కొన్నిసార్లు రుణదాతైన బ్యాంకుకు ఉండదు. కానీ రిసీవర్ బ్యాంక్, థర్డ్ పార్టీ పేమెంట్ యాప్‌ల వద్ద ఆ సమాచారం అందుబాటులో ఉంటుంది. కస్టమర్ అనుమతితో యూపీఐ చెల్లింపులు, టెలికాం కంపెనీల నుంచి లభించే ఇతర ప్రత్యామ్నాయ డేటాను ఉపయోగించి రుణం ఇచ్చే సామర్థ్యాన్ని అంచనా వేయవచ్చు. ఈ మోడల్ ద్వారా ఎస్బీఐ చిన్న వ్యాపారుల లోన్ సమస్యలను తీర్చాలని చూస్తోంది. ఈ కొత్త విధానం విజయవంతమైతే.. ఎలాంటి జీఎస్టీ రిజిస్ట్రేషన్ లేని చిన్న దుకాణదారులు, వ్యాపారులు సైతం సులభంగా బ్యాంక్ లోన్లు పొందే అవకాశం లభిస్తుంది. క్రమం తప్పకుండా డిజిటల్ లావాదేవీల రికార్డు ఉన్న ప్రతి చిన్న వ్యాపారికి ఇది ఎంతో ప్రయోజనకరంగా మారుతుంది.
తాజావార్తలు
-
SBI Loans: ఎస్బీఐ ఖాతాదారులకు శుభవార్త.. UPI చెల్లింపుల ఆధారంగా కూడా రుణాలు మంజూరు..
-
Modi-Jinping: అరుదైన ఖనిజాలు, వాణిజ్య లోటు.. మోడీ-జిన్‌పింగ్ భేటీలో కీలకాంశాలు..
-
Soori : అద్దం ముందు షర్ట్ విప్పేసి.. నా ఒంటిపై ఉన్న గాయాలకు నేనే ముద్దులు పెట్టుకున్నా.
-
Ganesh Utsav: ఇంటికే పరిమితమైన గణపతి గల్లీలోకి ఎలా వచ్చాడో తెలుసా? 1905 నాటి ఆ చరిత్ర ఇదిగో!
-
Notification Cancelled: నిరుద్యోగులకు అలర్ట్.. TGPSC నుంచి విడుదలైన ఆ నోటిఫికేషన్ రద్దు..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!