SBI YONO: దేశీయ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ కస్టమర్ల కోసం ఎప్పటికప్పుడు మార్పులు చేస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో YONO యాప్‌లో మార్పులు చేసింది. దీని ద్వారా SBI కస్టమర్లు YONO నుండి నేరుగా చెల్లింపులు చేయవచ్చు.
Kajol Photos: బ్లాక్ శారీలో కాక రేపుతున్న కాజోల్.. లేటు వయసులోనూ ఎక్కడా తగ్గట్లేదుగా!
బ్యాంక్ తాజాగా తీసుకొచ్చిన యోనో యాప్‌లో అదనపు ఫీచర్లు ఉంటాయి. యోనో అంటే యూ నీడ్ ఓన్లీ వన్. అయితే, ఇకపై యోనో యాప్‌లో యూపీఐ సేవలు కూడా పొందవచ్చు. అంటే స్కాన్ అండ్ పే, పే బై కాంటాక్ట్స్, రిక్వెస్ట్ మనీ వంటి సర్వీసులు లభిస్తాయి. SBI 2017 సంవత్సరంలో YONO యాప్‌ను ప్రారంభించింది. ఆ తర్వాత కస్టమర్లు పెరుగుతూనే ఉన్నారు. ఇప్పటివరకు కోట్లాది మంది ప్రజలు SBI యొక్క YONO యాప్‌ని ఉపయోగిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ యాప్‌ను 6 కోట్ల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. యోనో యాప్ ద్వారానే గత ఆర్థిక ఏడాదిలో ఏకంగా 78.6 లక్షల పొదుపు ఖాతాలు తెరవడం గమనార్హం.
Faria Abdullah : బీచ్ లో చీర కట్టుతో రచ్చ చేసిన ఫరియా.
తాజాగా తెచ్చిన అప్డేట్ వర్షన్ కారణంగా కస్టమర్లకు మరిన్ని ఫీచర్లు అందుబాటులోకి వస్తాయి. ఇతర బ్యాంకుల కస్టమర్లు కూడా యోనో యాప్ ద్వారా సేవలు పొందొచ్చు. ఎస్‌బీఐ ఇంటర్ ఆపరేబుల్ కార్డ్ లెస్ క్యాష్ విత్ డ్రాయెల్ ఫెసిలిటీ కూడా లాంచ్ చేసింది. బ్యాంకు 68వ వార్షికోత్సవం సందర్భంగా ఈ సర్వీసులు తీసుకువచ్చింది. ఈ కొత్త క్యాష్ విత్ డ్రాయెల్ సర్వీసుల ద్వారా ఇతర బ్యాంకుల కస్టమర్లు సైతం బెనిఫిట్ పొందవచ్చు. Yono యాప్ సహాయంతో.. SBI కస్టమర్లు బ్యాంకింగ్ లావాదేవీలే కాకుండా సినిమా టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు. షాపింగ్ చేయవచ్చు, ఆహారం మరియు పానీయాల బిల్లులతో పాటు ఇతర చెల్లింపులు చేయవచ్చు.
