Har Ghar Lakhpati: ప్రభుత్వ సెక్టార్ లో దిగ్గజ బ్యాంక్ అంటే.. టక్కున గుర్తొచ్చేది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. కోట్లాది మంది ప్రజలకు తన సేవలను అందిస్తోంది ఎస్‌బీఐ. కస్టమర్ల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త పథకాలను తీసుకొస్తుంది. ఖాతాదారులకు లాభం చేకూరేలా స్కీమ్స్ ను లాంఛ్ చేస్తుంది. తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఎస్‌బీఐ కొత్త డిపాజిట్ పథకాలను లాంఛ్ చేసింది. అదే ఎస్‌బీఐ ‘హర్ ఘర్ లఖ్‌పతీ’ రికరింగ్ డిపాజిట్ స్కీమ్. ఇందులో పొదుపు చేస్తే మీరు లక్షాధికారి అయిపోవచ్చు. రోజుకు కేవలం రూ. 85 పొదుపు చేస్తే చేతికి రూ. లక్షఅందుకోవచ్చు. మరి ఈ స్కీమ్ లో వడ్డీ ఎంత అందిస్తారు? అర్హులు ఎవరు? ఆ వివరాలు మీ కోసం..
Also Read: Apple: జీతాల మోసం..185 మందిని తొలగించిన యాపిల్.. ఇంత కక్కుర్తి ఎందుకు..
నేటి రోజుల్లో పొదుపు అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే సంపాదించిన దాంట్లో కొంత మొత్తాన్ని సేవ్ చేయడం ఉత్తమం. మీరు కూడా ప్రతి నెల కొంత మొత్తాన్ని జమ చేయాలనుకుంటే ఎస్‌బీఐ అందించే ‘హర్ ఘర్ లఖ్‌పతీ’ రికరింగ్ డిపాజిట్ స్కీమ్ బెటర్ ఆప్షన్ గా చెప్పొచ్చు. ఈ పథకంలో మీరు జమ చేసే సొమ్ముపై ప్రతి నెల వడ్డీపై వడ్డీ జమ అవుతుంది. దీంతో తక్కువ సమయంలోనే ఎక్కువ రాబడి అందుకోవచ్చు. ఈ స్కీమ్ లో పర్సనల్ గా లేదా జాయింట్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. 10 ఏళ్లకంటే తక్కువ వయసున్న వారు తల్లిదండ్రులు లేదా చట్టపరమైన సంరక్షకుల ఆధ్వార్యంలో అకౌంట్ తెరవాల్సి ఉంటుంది. ఈ స్కీమ్ లో మెచ్యూరిటీ పీరియడ్ 3 నుంచి 10 ఏళ్ల వరకు ఉంటుంది. ఈ స్కీమ్ లో 3, 4 ఏళ్ల టెన్యూర్ అయితే జనరల్ కస్టమర్లకు వడ్డీ రేటు 6.75 శాతంగా ఉంది. సీనియర్ సిటిజన్లకు 7.25 శాతం వడ్డీ వస్తుంది.
రూ. 85 పొదుపుతో చేతికి రూ. లక్ష:
ఇక ఈ స్కీమ్ లో రూ. లక్ష రూపాయలు అందుకోవాలంటే రోజుకు రూ. 85 జమ చేయాల్సి ఉంటుంది. అంటే నెలకు రూ. 2500 జమ అవుతుంది. ఈ పొదుపుపై 6.75 వడ్డీ వస్తుంది. 3 ఏళ్ల టెన్యూర్ ఎంచుకున్నట్లైతే మెచ్యూరిటీ నాటికి రూ. లక్ష అందుకోవచ్చు. మీరు 4 ఏళ్ల టెన్యూర్ ఎంచుకుంటే నెలకు రూ. 1810 చెల్లించాల్సి ఉంటుంది. అదే ఐదేళ్ల కాలానికి అయితే రూ. 1407 చెల్లించాల్సి ఉంటుంది. మరి చిన్న మొత్తాల్లో ఇన్వెస్ట్ చేయాలనుకునే వారు ఎస్‌బీఐ అందించే ఈ స్కీమ్ లో వెంటనే అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మరిన్ని వివరాలకు సమీపంలోని ఎస్‌బీఐ బ్రాంచ్ ను సంప్రదించి తెలుసుకోవచ్చు.