Site icon NTV Telugu

SBI : కస్టమర్లకు గుడ్ న్యూస్… ఇకమీదట ఆ సర్వీసులు కూడా..

Sbi Scheme

Sbi Scheme

ప్రముఖ దేశీయ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు ఎప్పటికప్పుడు గుడ్ న్యూస్ లను చెబుతూనే ఉంది.. తాజాగా మరో తీపికబురు చెప్పింది.. కొత్త సర్వీసులు అందుబాటులోకి తెచ్చింది. దీని వల్ల చాలా మందికి ఊరట కలుగుతుందని చెప్పుకోవచ్చు. ఇంతకీ బ్యాంక్ ఏ సర్వీసులను కొత్తగా అందుబాటులోకి తెచ్చిందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

తాజాగా వర్చువల్ డెబిట్ కార్డు సర్వీసులు అందుబాటులోకి తెచ్చింది. ఎస్‌బీఐ యోనో కస్టమర్లు ఈ సర్వీసులు ఇప్పుడు ఇంటి వద్ద నుంచే పొందొచ్చు. యోనో యాప్ ద్వారా వర్చువల్ డెబిట్ కార్డు పొందొచ్చు. ఫిజికల్ డెబిట్ కార్డు కోసం బ్యాంక్‌కు వెళ్లాల్సిన పని లేకుండానే ఆన్‌లైన్‌లో మీరు సలుబంగా వర్చువల్ డెబిట్ కార్డు పొందొచ్చు. ఈ డెబిట్ కార్డును ఎలా పొందాలి? దీని వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

మీరు యోనో యాప్ ను వాడుతున్నట్లయితే వర్చువల్ డెబిట్ కార్డును జనరేట్ చేసుకోవచ్చు. దాని ద్వారా క్యాష్‌లెస్ ట్రాన్సాక్షన్లను నిర్వహించొచ్చు. అలాగే కాంటాక్ట్‌లెస్ పేమెంట్లు కూడా చేయొచ్చు. అలాగే కార్డు యూసేజ్‌ను కస్టమైజ్ చేసుకోవచ్చు. లిమిట్ ను సెట్ చేసుకొనే అవకాశం కూడా ఉంటుంది.. రూపే, వీసా, మాస్టర్ కార్డ్ ఆప్షన్లలో లభిస్తుంది. అంటే మీరు ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడైనా ఈ వర్చువల్ డెబిట్ కార్డును ఉపయోగించొచ్చు..

మీరు జెనరేట్ చేసుకున్న వెంటనే ఈ డెబిట్ కార్డును మీరు పొందవచ్చు.. ఇకామర్స్ లావాదేవీలకు దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఇంకా కాంటాక్ట్‌లెస్ పేమెంట్లు చేయొచ్చు. పీఓఎస్ ట్రాన్సాక్షన్లను కూడా మొబైల్ ద్వారా చెల్లించొచ్చు. జీరో ఇష్యూయెన్స్ ఫీజు బెనిఫిట్ ఉంది. అలాగే వార్షిక మెయింటెనెన్స్ చార్జీలు కూడా ఉండవు. ఎకో ఫ్రెండ్లీ. అందువల్ల మీరు ఎస్‌బీఐ యోనో యాప్ ఉపయోగిస్తూ ఉన్నట్లయితే వెంటనే ఈ కార్డును పొందండి.. ఈ సర్వీసులను ఎంజాయ్ చెయ్యండి..

Exit mobile version