Bank Robbery: పట్టపగలు SBI బ్యాంక్‌లో ఘరానా దోపిడీ.. వీడియో వైరల్

  • గుజరాత్‌లోని సూరత్ నగరంలో SBI బ్యాంక్‌లో భారీ దోపిడీ
  • వరాఛా ప్రాంతంలోని లంబే హనుమాన్ రోడ్‌లో ఘటన
  • పట్టపగలు 5-6 మంది దుండగులు దాడి
  • పిస్తోల్స్‌తో బెదిరించి సుమారు రూ.50 లక్షల నగదు దోపిడీ..
Bank Robbery

Bank Robbery

Bank Robbery: గుజరాత్‌లోని సూరత్ నగరంలో స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా (SBI) లో భారీ దోపిడీ ఘటన చోటుచేసుకుంది. వరాఛా ప్రాంతంలోని లంబే హనుమాన్ రోడ్‌పై ఉన్న SBI శాఖలో పట్టపగలు పూటే ఈ దాడి జరగడం కలకలం రేపింది. 5-6 మంది దుండగులు పిస్తోల్స్‌తో బెదిరించి బ్యాంక్ సిబ్బందిని బంధించి సుమారు రూ.50 లక్షల నగదును దోచుకెళ్లారు.

అందిన సమాచారం ప్రకారం.. మధ్యాహ్న సమయంలో బ్యాంక్‌ లోకి చొరబడిన దొంగలు ముందుగా సిబ్బందిని ఆయుధాలతో బెదిరించి కట్టడి చేశారు. అనంతరం కౌంటర్‌ లో ఉన్న నగదు సుమారు రూ.50 లక్షల వరకు లూటీ చేశారు. దోపిడీ అనంతరం నగదును బ్యాగుల్లో నింపుకుని స్పోర్ట్స్ బైక్‌లపై అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటన మొత్తం బ్యాంక్‌ లో ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయింది.

ఈ దోపిడీకి దుండగులు ముందుగానే పక్కా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సిబ్బంది వెంట ఉన్న మొబైల్ ఫోన్లను కూడా లాక్కోవడం ద్వారా వెంటనే పోలీసులకు సమాచారం అందకుండా అడ్డుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు వెంటనే స్పందించి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. పగలు పూటే జరిగిన ఈ దోపిడీ స్థానికంగా తీవ్ర ఆందోళనకు దారితీసింది.