MCLR Rate Hike: మీరు ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కస్టమర్ అయితే ఈ వార్త మీకోసమే. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు (MCLR)లో 0.05 శాతం పెంచినట్లు ప్రకటించింది. బ్యాంక్ వెబ్‌సైట్ ప్రకారం, ఒక సంవత్సరం MCLR 0.05 శాతం పెరగడంతో ఇప్పుడు తొమ్మిది శాతానికి చేరుకుంది. వ్యక్తిగత, ఆటో, గృహ రుణాల రేటు ఒక సంవత్సరం MCLR రేటు ద్వారా నిర్ణయించబడుతుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మూడు, ఆరు నెలల MCLR ను పెంచింది. అయితే ఒక రోజు, ఒక నెల, రెండు సంవత్సరాలు, మూడు సంవత్సరాల MCLR అలాగే ఉంచింది.
Also Read: Ayyappa Devotees: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. ఈ నెల 17 నుంచి ఎస్‌సీఆర్ 26 ప్రత్యేక రైళ్లు..
విషయం సంబంధించి బ్యాంక్ ఛైర్మన్ సిఎస్ శెట్టి మాట్లాడుతూ.. బ్యాంక్ రుణ విభాగంలో 42 శాతం ఎంసీఎల్‌ఆర్‌తో అనుసంధానించబడిందని, మిగిలినవి బయటి బెంచ్‌మార్క్‌లపై ఆధారపడి ఉన్నాయని చెప్పారు. బ్యాంకింగ్ వ్యవస్థలో డిపాజిట్ రేట్లు ఆల్ టైమ్ హైలో ఉన్నాయని కూడా ఆయన స్పష్టం చేశారు. బ్యాంక్ ఇటీవల MCLRని రెండుసార్లు పెంచింన విషయం తెలిసిందే. అదే సమయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తన పాలసీ రేటు రెపోను వరుసగా పదవసారి 6.5 శాతం వద్ద యథాతథంగా ఉంచాలని నిర్ణయించింది. అయితే రానున్న నెలల్లో వడ్డీ రేట్లు తగ్గే అవకాశం ఉంది.
Also Read: Aadhaar Update: ఆధార్‌ను ఎన్నిసార్లు అప్‌డేట్ చేసుకోవచ్చంటే? నిబంధనలు ఏమంటున్నాయంటే
మరోవైపు, ప్రైవేట్ రంగ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఎంపిక చేసిన మెచ్యూరిటీ పీరియడ్‌ల రుణాలపై MCLRని 0.05 శాతం పెంచింది. ఒక సంవత్సరం కాలానికి ప్రామాణిక MCLR రేటు 9.45 శాతం వద్ద ఉంచబడింది. అయితే, ఒక రోజు MCLR 9.1 శాతం నుండి 9.15 శాతానికి పెరిగింది. అయితే ఒక నెల రేటు 0.05 శాతం పెరిగి 9.2 శాతానికి చేరుకుంది. ఇతర మెచ్యూరిటీ పీరియడ్‌లతో కూడిన రుణాల రేట్లలో ఎలాంటి మార్పు లేదు. కొత్త రేట్లు నవంబర్ 7, 2024 నుండి అమలులోకి తీసుక వచ్చింది.