స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం సెంటర్‌లో శుక్రవారం అర్ధరాత్రి చోరీ జరిగింది. ఈ ఘటన అనంతపురం జిల్లా కూడేరు మండలంలో చోటుచేసుకుంది. గుర్తుతెలియని వ్యక్తులు ఏటీఎంలోకి చొరబడి అందులోని రూ.18,41,300 నగదు అపహరించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కూడేరులోని దళితవాడ ఎదురుగా ఉన్న అనంతపురం – బళ్లారి ప్రధాన రహదారి పక్కనే అనంతపురం సాయినగర్ లోని స్టేట్ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ ఏటీఎం కేంద్రాన్ని తెరిచారు.
Rahul Gandhi: లోక్ సభ ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ.. కాంగ్రెస్ లో కొత్త ఉత్సాహం
శుక్రవారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు కత్తితో ఏటీఎంను తెరిచారు. మిషన్ లో ఉంచిన నగదు చోరీకి గురైంది. ఈ క్రమంలో మిషన్‌లో షార్ట్ సర్క్యూట్ జరిగి మిషన్ పై భాగం కాస్త కాలిపోయింది. అక్కడి శబ్దం విని స్థానికులు బయటకు రాగా, పలువురు వ్యక్తులు ఏటీఎం సెంటర్ నుంచి కారులో బయలుదేరి వెళ్లడం చూసారు. ఇక ఏటీఎం సెంటర్ నుంచి పొగలు రావడాన్ని గమనించారు.
Atrocity in Medchal: మేడ్చల్ లో దారుణం.. మంత్రాల పేరుతో వివాహితపై అత్యాచారం
కొంతసేపటి తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసారు స్థానికులు. సీఐ శివరాముడు ఏటీఎం కేంద్రాన్ని తనిఖీ చేశారు. చోరీ జరిగినట్లు గుర్తించి బ్యాంకు ఉద్యోగులకు సమాచారం అందించారు. సంబంధిత అధికారులు వచ్చి తనిఖీలు చేపట్టారు. ప్రధాన కార్యాలయం నుండి నగదు నిల్వలు, ఉపసంహరణలపై డేటా సేకరించబడింది. రూ. 18,41,300 సొమ్ము చోరీకి గురైనట్లు పోలీసులకు తెలిపారు బ్యాంకు అధికారులు. దాంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.