NTV Telugu Site icon

Sayaji Shinde : పవన్ సార్ అపాయింట్మెంట్ ఇప్పించండి.. ఓ మంచి పని చేయించాలి

New Project (72)

New Project (72)

Sayaji Shinde : బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 అయిదు వారాలను పూర్తి చేసుకుంది. ఇప్పటికే ఆరుగురు ఎలిమినేట్ అవ్వగా కొత్తగా మళ్లీ ఎనిమిది మంది వైల్డ్ కార్డు ఎంట్రీలు ఇచ్చారు. వచ్చిన ఎనిమిది మంది కూడా గత బిగ్ బాస్ సీజన్స్ లో పాల్గొన్నవాళ్లే. ఆదివారం జరిగిన ఎపిసోడ్ లో హౌసులో కంటెస్టెంట్లకు టాస్కులు పెట్టేందుకు, తమ సినిమాలను ప్రమోట్ చేసేందుకు కొంతమంది సెలబ్రిటీలు కూడా బిగ్ బాస్ హౌసులోకి వెళ్లారు. ఈ క్రమంలోనే ‘మా నాన్న సూపర్ హీరో’ సినిమా ప్రమోషన్ నిమిత్తం షాయాజీ షిండే, హీరో సుధీర్ బాబు, హీరోయిన్ ఆర్ణా కూడా వచ్చారు.

Read Also:Raebareli: యూపీలో రైళ్లను పట్టాలు తప్పించేందుకు కుట్రలు.. రాయ్‌బరేలీలో ట్రాక్పై ఇసుక కుప్ప

ఈ సినిమాతో మరోసారి వీళ్లంతా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 11న రిలీజ్ కానుంది. బిగ్ బాస్ స్టేజిపై సుధీర్ బాబు షాయాజీ షిండే గురించి మాట్లాడుతూ ఖాళీ ప్రదేశం కనిపిస్తే మొక్కలు నాటుతారని అన్నారు. దీంతో నాగార్జున కారణం అడగ్గా షాయాజీ షిండే మాట్లాడుతూ.. మా అమ్మ చనిపోయే ముందు నా దగ్గర ఇంత డబ్బు ఉండి కూడా ఆమెను బతికించుకోలేకపోతున్నాను.. నేనేం చేయగలను అని ఆలోచించాను. అప్పుడు మా అమ్మ బరువుకు సమానమైన విత్తనాలను తీసుకొచ్చి ఇండియా మొత్తం నాటాలని ఫిక్స్ అయ్యాను. అవి పెరిగి పూలు, పండ్లు ఇస్తాయి. వాటిని చూస్తుంటే మా అమ్మ నాకు గుర్తొస్తుంది. సాధారణంగా ఆలయాలకు వెళ్తే ప్రసాదం ఇస్తారు. ప్రసాదంతో పాటు ఓ మొక్క కూడా ఇస్తే బాగుంటుంది.

Read Also:Suryakumar Yadav: అది పెద్ద తలనొప్పి అయ్యింది: సూర్యకుమార్

నేను మహారాష్ట్రలో ఆల్రెడీ మూడు ఆలయాల్లో ఆచరణలో పెట్టాను. అందరికి కాకపోయినా అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేయించే వాళ్లకు ఇస్తారు. ఇక్కడ కూడా అది ఇంప్లిమెంట్ చేయాలని అనుకుంటున్నాను. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి అపాయింట్ మెంట్ దొరికితే ఆయనను కలిసి ఈ వివరాలు చెప్తాను. దేవుడి ప్రసాదంతో పాటు మొక్కలు కూడా పంచాలి. అవి తర్వాత జన్మలకు కూడా ఉంటాయి అని తెలిపారు. దీంతో సుధీర్ బాబు, నాగార్జున.. మీరు ఇప్పుడు చెప్పారుగా ఈ మాటలను ఆయన ఫ్యాన్స్ ఆయన దగ్గరకు తీసుకెళ్తారు. మీ కోరిక నెరవేరుతుందని అన్నారు. దీంతో ప్రస్తుతం షాయాజీ షిండే వ్యాఖ్యలు వైరల్ అవ్వగా పవన్ ఫ్యాన్స్ ఈ వీడియోని షేర్ చేస్తున్నారు. మంచి ఆలోచన అని అంతా షాయాజీ షిండేని అందరూ తెగ మెచ్చుకుంటున్నారు.

Show comments