Site icon NTV Telugu

Saving Scheme : ప్రతి నెలా రూ.3 వేలు.. అదిరిపోయే స్కీమ్..

Indian Women Counting Indian Currency

Indian Women Counting Indian Currency

పోస్టాఫీస్ తమ కస్టమర్స్ కోసం ఎన్నో రకాల స్కీమ్ అందిస్తుంది.. కొత్తగా పొదుపు చెయ్యాలనుకొనేవారికి ఇది మంచిది బెనిఫిట్స్ ఇస్తుంది.. పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ అందిస్తోంది..ఈ స్కీమ్ గురించి వివరంగా తెలుసుకుందాం..

ఈ స్కీమ్ లో డబ్బులను ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలను పొందవచ్చు..అయితే ఈ స్కీమ్‌లో చేరాలని భావించే వారు ఒక విషయం గుర్తించుకోవాలి. ఒకేసారి డబ్బులు ఇన్వెస్ట్ చేయాల్సి ఉటుంది. ఈ డబ్బుపై మీరు ప్రతి నెలా వడ్డీ రూపంలో రాబడి పొందొచ్చు. మెచ్యూరిటీ తర్వాత మీ డబ్బులుకు మీకు వస్తాయి.. ఈ స్కీమ్ వల్ల మీరు రూ.9 లక్షల వరకు దాచుకోవచ్చు.. అలాగే మీరు జాయింట్ అకౌంట్ తీసుకుంటే మాత్రం మీరు.. రూ.15 లక్షలు ఆదా చేసుకోవచ్చు.. గతంలో గరిష్టంగా రూ. 9 లక్షల వరకు మాత్రమే ఇన్వెస్ట్‌ చేసే అవకాశం ఉండేది. అయితే ఇప్పుడు ఈ లిమిట్ చాలా ఎక్కువగానే ఉందని చెప్పుకోవచ్చు..

స్కీమ్ మెచ్యూరిటీ కాలం ఐదేళ్లు. ప్రస్తుతం ఈ స్కీమ్‌పై 7.4 శాతం మేర వడ్డీ లభిస్తోంది. ఈ వడ్డీ రేటు ప్రతి మూడు నెలలకు ఒకసారి తగ్గొచ్చు. లేదంటే పెరగొచ్చు. లేదంటే స్థిరంగా కూడా ఉండొచ్చు. ఉదాహరణకు మీరు ఈ పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్‌ స్కీమ్‌లో రూ. 15 లక్షలు ఇన్వెస్ట్ చేశారని అనుకుందాం. ఇప్పుడు మీకు చేతికి ప్రతి నెలా రూ. 9,250 వరకు వస్తాయి.. అదే మీరు రూ.5 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే.. మీకు ప్రతి నెలా రూ. 3 వేలు పొందవచ్చు.. ఇంకా ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయని నిపుణులు అంటున్నారు..

Exit mobile version