Save Punarvika: పునర్విక ప్రాణం నిలిచింది? అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన సోషల్ మీడియా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Save Punarvika: ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, యూట్యూబ్.. ఏ సోషల్ మీడియా అకౌంట్ ఓపెన్ చేసినా సేవ్ పునర్విక (‘#SavePunarvika’) అనే కంటెంట్ కనిపిస్తోంది. ఓ 11నెలల పసిపాపను రక్షించేందుకు చేపట్టిన ఈ మహా యజ్ఞం విజయవంతంగా కొనసాగుతోంది. ఆ పాప బతకాలంటే రూ.16 కోట్ల విలువైన ఇంజెక్షన్ అవసరమని ఓ ఇస్టాగ్రామ్ కంటెంట్ క్రియేటర్ గత కొన్ని రోజుల కిందట ఓ వీడియో రిలీజ్ చేశాడు. దీంతో తెలుగు యువత ఒక్కసారిగా ముందుకు వచ్చింది. చాలా మంది ప్రముఖ కంటెంట్ క్రియేటర్లు సైతం ఫండింగ్ కలెక్ట్ చేయడం మొదలు పెట్టారు. తాజా సమాచారం ప్రకారం.. రూ. 8.53 కోట్లు కలెక్ట్ చేసినట్లు ఈ బాలికను సేవ్ చేసేందుకు ప్రయత్నిస్తున్న టీమ్ యువకులు తెలిపారు. ఈ మేరకు ఓ వీడియో విడుదల చేస్తూ ఎక్కడెక్కడి నుంచి ఎంత కలెక్ట్ చేశారు? అనే వివరాలు పంచుకున్నారు. అలాగే ఈ ఫండింగ్‌ను ఇక్కడితో అఫీసియల్‌గా క్లోజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. మిగతా డబ్బులను ఏపీ ప్రభుత్వం సమకూర్చనున్నట్లు సమాచారం! ఒక పసిపాప ప్రాణం రక్షించడం కోసం ఇంత పెద్ద ఎత్తున తెలుగు యువత స్పందించడం, ఇంత భారీ మొత్తంలో అమౌంట్ కలెక్షన్ చేయడం గర్వకారణం.
Also Read
- ACB Raids: టీటీడీ డిప్యూటీ ఈవో ఇంట్లో ఏసీబీ దాడులు.. ఏకకాలంలో 5 చోట్ల సోదాలు.. 15 ఏళ్ల తర్వాత!
- IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!
- Pawan Kalyan Fan: పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల్లో పెను విషాదం.. కరెంట్ షాక్‌తో అభిమాని మృతి!
- AICC Disciplinary Action: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై క్రమశిక్షణ చర్యలు.? నేడు ఏఐసీసీ కీలక నిర్ణయం
ఇంతకీ ఆ 11 నెలల పాప ఎవరు?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా వెల్దుర్తికి చెందిన జంపాల మంగలి సురేశ్‌కుమార్, పుష్పావతి దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమార్తె పునర్వికశ్రీ 2025 మే 12న జన్మించింది. పునర్విక ఆరు నెలలైన తన శరీరాన్ని కదిలించలేక పోయింది. దీంతో కంగారు పడిన పేరెంట్స్ సమీప కర్నూలు ఆసుపత్రుల్లో చికిత్స చేయించారు. ఆ డాక్టర్ల సిఫార్స్ మేరకు హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ హాస్పటల్‌కు తీసుకెళ్లారు.. చిన్నారిని పరిస్థితి, రిపోర్ట్స్‌ను పూర్తిగా పరిశీలించిన వైద్యులు అరుదైన సమస్యను గుర్తించారు. స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ (SMA)అనే జన్యుపరమైన సమస్య ఉందని స్పష్టం చేశారు. SMA అనేది వెన్నెముకలోని నరాల కణాలను (motor neurons) దెబ్బతీసే ఒక జన్యుపరమైన వ్యాధి. ఇది కండరాల బలహీనత, క్షీణతకు (atrophy) దారితీస్తుంది. ఈ వ్యాధి వల్ల నడక, శ్వాస, మింగడం, కదలికలు కష్టమవుతాయి. ఇది తరచుగా పిల్లలలో కనిపిస్తుంది. దీనికి న్యూసిన్సెన్, జోల్జెన్స్మా, రిస్డిప్లామ్ వంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. అయితే.. ఒక్క ఇంజెక్షన్ విలువ రూ. 16 కోట్లు ఉంటుంది. ఆ ఇంజెక్షన్ ద్వారా పునర్విక బతుకుతుందట.
తాజావార్తలు
-
Mega wishes: ‘సంకల్ప సాధకుడు కళ్యాణ్ బాబు’.. పవన్‌కు చిరంజీవి మెగా బర్త్‌డే విషెస్!
-
ACB Raids: టీటీడీ డిప్యూటీ ఈవో ఇంట్లో ఏసీబీ దాడులు.. ఏకకాలంలో 5 చోట్ల సోదాలు.. 15 ఏళ్ల తర్వాత!
-
Panja Re Release: 15 ఏళ్ల తర్వాత కూడా తగ్గని పవన్ కళ్యాణ్ క్రేజ్.. ‘పంజా’ రీ రిలీజ్‌కు అదిరిపోయే ఓపెనింగ్స్!
-
Soft Roti Tips: పెనం నుంచి తీయగానే రోటీ గట్టిపడిపోతోందా? ఈ సింపుల్ టిప్‌తో రోజంతా సాఫ్ట్‌గా!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!
ట్రెండింగ్
-
8,050mAh బ్యాటరీ, 185Hz AMOLED డిస్‌ప్లే, 200MP కెమెరాతో ఫ్లాగ్షిప్ ఫోన్ POCO F9 Ultra లాంచ్.!
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్‌ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!