2005లో లండన్‌లో జరిగిన ఘోర కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సౌదీ యువరాజు అల్వలీద్ బిన్ ఖలీద్ బిన్ తలాల్ కోమాలోకి వెళ్లారు. రెండు దశాబ్దాల తర్వాత, సౌదీ యువరాజు మరణించారు. ఆయనకు 36 ఏళ్లు. దాదాపు ఇరవై సంవత్సరాల పాటు కొనసాగిన సుదీర్ఘ పోరాటం తర్వాత మరణించిన ప్రిన్స్ అల్వలీద్ బిన్ ఖలీద్ బిన్ తలాల్ అల్ సౌద్ మృతి పట్ల గ్లోబల్ ఇమామ్స్ కౌన్సిల్ తన హృదయపూర్వక సంతాపాన్ని తెలియజేస్తోంది” అని గ్లోబల్ ఇమామ్స్ కౌన్సిల్ ఒక ప్రకటనలో తెలిపింది. అల్ వలీద్ తండ్రి ఖలీద్ బిన్ తలాల్ అల్ సౌద్ కూడా ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా ధ్రువీకరించారు.
Also Read:PM Surakha Bima Yojana: సిగరెట్లు, టీ మానేయండి.. కేవలం రూ. 20కే రూ. 2 లక్షలు పొందే ఛాన్స్..
యూకే లోని ఓ సైనిక కళాశాలలో చదువుతున్నప్పుడు కారు ప్రమాదం జరిగింది. అప్పుడు ప్రిన్స్ అల్వలీద్ వయసు 15 సంవత్సరాలు. ఈ ప్రమాదంలో తలకు తీవ్ర గాయాలు అయ్యి అంతర్గత రక్తస్రావం జరిగింది. దీంతో అతను పూర్తిగా కోమాలోకి వెళ్లిపోయాడు. తరువాత అతన్ని రియాద్‌లోని కింగ్ అబ్దులాజీజ్ మెడికల్ సిటీకి తరలించారు. అక్కడ దాదాపు 20 సంవత్సరాలుగా నిరంతర వైద్యుల సంరక్షణలో లైఫ్ సపోర్ట్ తో వైద్యం అందిస్తున్నారు. సంవత్సరాలు గడిచేకొద్దీ, ప్రిన్స్ అల్వలీద్ ‘స్లీపింగ్ ప్రిన్స్’ గా ప్రసిద్ధి చెందాడు. అయితే కొంతకాలానికి యువరాజులో కదలికలు కనిపించడంతో స్వల్ప ఆశను కలిగించాయి. కానీ, అమెరికన్, స్పానిష్ నిపుణులు చికిత్స చేసినప్పటికీ, అతను ఎప్పుడూ పూర్తి స్పృహలోకి రాలేదు.
Also Read:Fake Call Center: మెయిల్స్ పంపుతూ ఖాతాలు లూటీ.. నకిలీ కాల్ సెంటర్ గుట్టురట్టు..
అతని తండ్రి, ప్రిన్స్ ఖలీద్ బిన్ తలాల్, తన కొడుకు ప్రాణాలను కాపాడటానికి శాయశక్తులా ప్రయత్నించాడు.. వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నప్పటికీ కోలుకునే అవకాశం లేదని భావించి 2015లో దాన్ని తొలగించాలని వైద్యులు సిఫార్సు చేశారు. అయితే, ఏదైనా అద్భుతం జరగొచ్చనే ఆశతో ఆయన తండ్రి అందుకు నిరాకరించారు. దేవుడు మాత్రమే మరణ క్షణాన్ని నిర్ణయిస్తాడని అతను చెప్పాడు. ఏప్రిల్ 1990లో జన్మించిన ప్రిన్స్ అల్వలీద్, ప్రిన్స్ ఖలీద్ బిన్ తలాల్ అల్ సౌద్ పెద్ద కుమారుడు, బిలియనీర్ వ్యాపారవేత్త ప్రిన్స్ అల్వలీద్ బిన్ తలాల్ మేనల్లుడు.
