Site icon NTV Telugu

Saudi Arabia: వలసదారులపై బుల్లెట్ల వర్షం.. వందలాది మందిని హతమార్చిన సౌదీ సైన్యం!

Saudi Arabia

Saudi Arabia

Saudi Arabia: యెమెన్ గుండా గల్ఫ్ రాజ్యంలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్న ఇథియోపియన్ వలసదారులపై సౌదీ సరిహద్దు గార్డులు పేలుడు ఆయుధాలు ప్రయోగించారని, గత సంవత్సరం నుంచి వందల మందిని చంపారని హ్యూమన్ రైట్స్ వాచ్ సోమవారం తెలిపింది. సౌదీ అరేబియా సైన్యం సరిహద్దుల్లో బుల్లెట్లతో వలసదారులను కాల్చివేస్తోందని, గత ఏడాదిన్నర కాలంలో సౌదీ సైన్యం వందలాది మందిని హతమార్చిందని పేర్కొంది. వారి ఆర్థిక పరిస్థితి కారణంగా, ఇథియోపియా నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు ఆశ్రయం పొందేందుకు సరిహద్దు మార్గం ద్వారా సౌదీకి చేరుకుంటారు. యెమెన్ సరిహద్దు నుంచి సౌదీ అరేబియాలోకి ప్రవేశించే వ్యక్తులు ఆర్మీ బుల్లెట్లకు గురి అవుతున్నారని హ్యూమన్ రైట్స్ వాచ్ నివేదిక పేర్కొంది. దీనిని సౌదీ ప్రభుత్వం ఖండిస్తూ వస్తోంది.

Read Also: G20 Summit: వచ్చే నెలలో జీ 20సదస్సు.. వీవీఐపీ విమానాల పార్కింగ్‎కు సర్వం సిద్ధం

శరణార్థులపై సౌదీ సైన్యం పేలుడు ఆయుధాలతో దాడి చేస్తుందని హ్యూమన్ రైట్స్ వాచ్ తెలిపింది. సౌదీ సైన్యంపై ఇలాంటి తీవ్ర ఆరోపణలు రావడం ఇదే తొలిసారి కాదు. అయితే క్రమబద్ధమైన హత్యల ఆరోపణలను సౌదీ ప్రభుత్వం తోసిపుచ్చింది. నివేదికలో వలసదారులు, శరణార్థుల వీడియోలు, ఫోటోలు సాక్ష్యంగా ఇవ్వబడ్డాయి. ఈ వీడియోవో సౌదీ సైన్యం యొక్క భయానక రూపం చూపబడింది. వలసదారులు భయంకరమైన నైట్ టైమ్ క్రాసింగ్ గురించి మాట్లాడుతున్నారు. మహిళలు, చిన్నారులను కూడా వదిలిపెట్టడం లేదని తెలిసింది. సైన్యం బుల్లెట్ల వర్షం కురిపించిందని, పేలుడు ఆయుధాలతో దాడి చేశారని కొందరు చెప్పారు.

ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం, ప్రతి సంవత్సరం రెండు లక్షల మందికి పైగా ప్రజలు అక్రమంగా సరిహద్దులు దాటడానికి ప్రయత్నిస్తారు. హార్న్ ఆఫ్ ఆఫ్రికా నుంచి వారు యెమెన్ మీదుగా సముద్రం ద్వారా సౌదీలోకి ప్రవేశిస్తారు. స్మగ్లర్లు కూడా వారితో దురుసుగా ప్రవర్తించి కొట్టారు. ఇలా సముద్రం దాటడం చాలా ప్రమాదకరం. ఇటీవల, జిబౌటీలో ఓడ బోల్తా పడి 24 మంది ప్రవాసులు మరణించారు. యెమెన్ గుండా వచ్చే ప్రజలు స్మశాన వాటిక గుండా వెళతారు. సైన్యం కాల్చి చంపిన తర్వాత వారి మృతదేహాలు అక్కడే పడి ఉన్నాయి. చాలా సార్లు సైన్యం ఒక సమూహంలోని కొంతమందిని కాల్చివేస్తుందని, వారి మృతదేహాలను తీసుకెళ్లడానికి కొంతమందిని విడిచిపెట్టిందని నివేదిక తెలిపింది.

Read Also: India-China: భారత్-చైనా సరిహద్దులో ప్రతిష్టంభనపై కొనసాగుతున్న చర్చలు

మార్చి 2022 నుండి జూన్ 2023 వరకు గణాంకాలు నివేదికలో ఇవ్వబడ్డాయి. ఈ సమయంలో, 28 సామూహిక హత్య కేసులు వెల్లడయ్యాయి. వీటిలో బుల్లెట్లు, పేలుడు ఆయుధాలు ఉపయోగించబడ్డాయి. సైన్యం వలస వచ్చిన వారిని పట్టుకుని కొట్టి కాల్చి చంపిన 14 కేసులు కనుగొనబడ్డాయి. అరబ్ ప్రపంచంలో అత్యంత పేద దేశం ఇథియోపియా. ఆర్థిక పరిస్థితి కారణంగా పెద్ద సంఖ్యలో ప్రజలు ఇతర అరబ్ దేశాలకు వెళుతున్నారు. ఆర్థిక స్థోమత ఉన్నవారు చట్టబద్ధంగా వెళతారు, కానీ ఆర్థిక స్థోమత లేని వారు సరిహద్దులో అక్రమంగా ప్రవేశించడానికి ప్రయత్నిస్తారు. ఈ సమయంలో వారు ఆర్మీ బుల్లెట్లకు బలై ప్రాణాలు కోల్పోతారు.

Exit mobile version