NTV Telugu Site icon

Satyavati Rathod : కాంగ్రెస్ పార్టీ 60 ఏళ్లు పరిపాలించి ప్రజల సంక్షేమాన్ని మరిచింది

Satyavathi Rathod

Satyavathi Rathod

భద్రాద్రి జిల్లాలోని ఇల్లందు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి సత్య రాథోడ్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, , మహబూబా బాద్ ఎంపీ కవిత, ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్‌ మాట్లాడుతూ.. 2018లో ప్రజల ఆమోదంతో రెండవ సారి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ అని ఆమె వ్యాఖ్యానించారు. ఈరోజు దేశంలోనే తెలంగాణను ఒక అగ్రగామి రాష్ట్రంగా నిలబెట్టిన ఘనత కేసీఆర్‌ది అని ఆమె కొనియాడారు. బీఆర్ ఎస్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను సంక్షేమ పథకాలను ప్రజల ముందుకు తీసుకెళ్లే బాధ్యత నాయకులది, కార్యకర్తలదని ఆమె అన్నారు.

అంతేకాకుండా.. ‘మన నాయకుడు నవంబర్ 1న జరిగే కేసీఆర్ సభకు 80వేల ప్రజలను సమీకరించాలి. కేసీఆర్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాల ద్వారా ప్రతి కుటుంబం లబ్ధి పొందింది. రాష్ట్రంలో అత్యధిక పట్టాలిచ్చిన ప్రాంతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఇల్లందు నియోజకవర్గంలో 18 వేల కుటుంబాలకు పోడు పట్టాల పంపిణీ, కేసీఆర్ మానస పుత్రిక సీతారాంసాగర్ ప్రాజెక్టు ఇల్లందు నియోజకవర్గంలో ఎక్కువ లాభం చేకూరే విధంగా కార్యాచరణ. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఉచితంగా తెలంగాణలో రైతులకు 24 గంటలు నాణ్యమైన కరెంటు సరాఫర.. స్వతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ 60 ఏళ్లు పరిపాలించి ప్రజల సంక్షేమాన్ని మరిచింది.

కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటక రాజస్థాన్, రాష్ట్రాలలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు. కేసీఆర్ పాలన దేశంలో ఆదర్శంగా నిలిచింది. 10 ఏండ్లుగా బీజేపీ తెలంగాణ ప్రాంతానికి ద్రోహం చేసింది. కాంగ్రెస్ పార్టీ బీజేపీ తెలంగాణ ద్రోహులు -బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ అడ్డుకున్నది బీజేపీ పార్టీ. కాంగ్రెస్, బీజేపీ పార్టీ ఒకటే. 65 ఏళ్లలో జరిగిన అభివృద్ధి ఒక ఎత్తు, 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధి ఒక ఎత్తు. బీఆర్ఎస్ పార్టీని ఆదరించి ఇల్లందు నియోజకవర్గంలో హరిప్రియ నాయక్‌ను గెలిపించాలి. ఏ సమస్యలు వచ్చినా కార్యకర్తలను ఆదుకుంటాం.’ అని సత్యవతి రాథోడ్‌ వ్యాఖ్యానించారు.