Satyavati Rathod : షర్మిల శిఖండి రాజకీయాలు మానుకోవాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహబూబాబాద్ జిల్లాలో ఇనుగుర్తిని మండల కేంద్రం ప్రారంభోత్సవంలో మంత్రులు సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎంపీ మాలోత్ కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. 37 సంవత్సరాల ఇనుగుర్తి ప్రజల చిరకాల కోరిక మండల కేంద్రాన్ని కేసీఆర్ తీర్చారన్నారు. తండాలను గ్రామపంచాయతీలు చేసిన ఘనత కేసీఆర్ ది అని, షర్మిల శిఖండి రాజకీయాలు మానుకోవాలనని ఆమె హితవు పలికారు. తెలంగాణకు అడ్డుపడ్డ ద్రోహి రాజన్న అని ఆమె వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. మానుకోట రాళ్లను మరచిపోవద్దని హెచ్చరించారు. తెలంగాణలో అలజడులు సృష్టించడానికే షర్మిల యాత్ర అని, దేశంలో ఎక్కడి లేని పథకాలు తెలంగాణలో అమలవుతున్నాయన్నారు.
మీ అన్న ఆంధ్రలో మోటర్ల కు మీటర్లు పెట్టిండని, కేసీఆర్ ఉన్నంత కాలం రైతులకు ఉచిత విద్యుత్ వస్తుందని ఆమె అన్నారు. టీఆర్ఎస్ నాయకులపై ఈడీ, సీబీఐ వంటి సంస్థలతో బీజేపీ దాడులు చేస్తుందని ఆమె ఆరోపించారు. కేసీఆర్ ఆశీర్వదంతో నేను మంత్రిగా ఉన్నాను ,కేసీఆర్ కి రుణపడి ఉంటానని ఆమె అన్నారు.
Also Read
- India-Singapore: భారత్-సింగపూర్ మధ్య కీలక ఒప్పందాలు.. విశేషాలు ఇవే!
- Smartphone Buying Trends: కెమెరా, బ్యాటరీ కంటే దానికే ఎక్కువ ప్రాధాన్యం.. స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో కొత్త ట్రెండ్.. సర్వేలో ఆసక్తికర అంశాలు..
- Pawan Kalyan: 21 సీట్ల వ్యూహం అసెంబ్లీ ఎన్నికలకే.. స్థానిక ఎన్నికల్లో జనసేన కొత్త వ్యూహం
- Southern Zonal Council Meeting: దక్షిణాది ఐక్యతే దేశ బలం.. జోనల్ కౌన్సిల్లో చంద్రబాబు కీలక ప్రసంగం
అనంతరం ఎంపి మాలోత్ కవిత మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో ఎవరైన సహజంగా యాత్ర చేసుకోవచ్చని, టీఆర్ఎస్ నాయకులను, ప్రజాప్రతినిధులు తిడితే ఊరుకునేదిలేదు అంటూ వైఎస్ షర్మిల పై ఆగ్రహం వ్యక్తం చేశారు. నీ రాజ్యం మాకు అవసరం లేదు.. నీది ఆంధ్ర… మాది తెలంగాణ అని ఆమె వ్యాఖ్యానించారు. ఏనాడు తెలంగాణ గురించి ఆలోచించని నీవు, నేడు తెలంగాణ కోడలు అనడం సిగ్గుచేటని ఆమె మండిపడ్డారు.
తెలంగాణ ఉద్యమంలో నీవు ఎక్కడ ఉన్నావని, ఆంధ్రలో నీ అన్న తంతే తెలంగాణ కు వచ్చినవు అంటూ ఆమె విమర్శించారు. తెలంగాణలో నీ ఆటలు సాగవని, చిల్లరగా మాట్లాడుతే ఊరుకునేది లేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. 60 లక్షల మంది టీఆర్ఎస్ కార్యకర్తల ఆగ్రహానికి షర్మిల గురికాక తప్పదన్నారు.
- Tags
తాజావార్తలు
-
India-Singapore: భారత్-సింగపూర్ మధ్య కీలక ఒప్పందాలు.. విశేషాలు ఇవే!
-
Smartphone Buying Trends: కెమెరా, బ్యాటరీ కంటే దానికే ఎక్కువ ప్రాధాన్యం.. స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో కొత్త ట్రెండ్.. సర్వేలో ఆసక్తికర అంశాలు..
-
Pawan Kalyan: 21 సీట్ల వ్యూహం అసెంబ్లీ ఎన్నికలకే.. స్థానిక ఎన్నికల్లో జనసేన కొత్త వ్యూహం
-
OTR: ప్రభుత్వానికి సలహాలు ఇస్తున్నారా? లేక పవర్, ప్రోటోకాల్ ఎంజాయ్ చేస్తున్నారా?
-
Southern Zonal Council Meeting: దక్షిణాది ఐక్యతే దేశ బలం.. జోనల్ కౌన్సిల్లో చంద్రబాబు కీలక ప్రసంగం
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?