Site icon NTV Telugu

మన రాష్టంలో వ్యవసాయానికి ఇచ్చిన ప్రాధాన్యత మరే రాష్టంలో లేదు : మంత్రి సత్యవతి

Satyvathi

Satyvathi

మహ‌బూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సత్యవతి రాథోడ్‌ పాల్గొన్నారు. హకా చైర్మన్‌గా ఇటీవల తెలంగాణ ప్రభుత్వం మచ్చ శ్రీనివాసరావు నియమించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్‌ మాట్లాడుతూ.. డోర్నకల్ నియోజకవర్గంలో మీ స్వంత గ్రామాన్ని ఎలా అభివృద్ధి చేసుకున్నారో ఇప్పుడు అదే విధంగా ఈ పదవికి వన్నె తేవాలని కోరుకుంటున్న అని ఆమె అన్నారు. తెలంగాణ సాధించుకున్నాక ప్రతి విషయంలో ప్రణాళిక రూపొందించడం కేసీఆర్‌కే చెందుతుందన్నారు. మహబూబాబాద్ లో ఆర్యవైశ్య భవనం కొరకు స్థల కేటాయింపు లో నా సహకారం ఉంటుందని, కేసీఆర్‌ మన రాష్టంకి వ్యవసాయానికి ఇచ్చిన ప్రాధాన్యత మరే రాష్టంలో లేదని ఆమె అన్నారు.

Also Red : Umair Sandhu: బన్నీ-రష్మిక రిలేషన్షిప్… అది ట్విట్టరా లేక టాయిలెట్ కమోడా?

 

మహబూబాబాద్ జిల్లా లోనే అత్యధికంగా జనాభా ఉన్నా జిల్లా వ్యవసాయ పై ఆధారపడి ఉన్నారు మీ పదవి వ్యవసాయ శాఖ పరమైనది కాబట్టి అందరిని మేలు చేయాలన్నారు. హకా ఛైర్మెన్ కావడం మాములు విషయం కాదు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అప్పట్లో హకా చైర్మన్‌ అయ్యారు మళ్ళి ఇప్పుడు మిమ్ములను వరించిందన్నారు. అనంతరం ఎమ్మెల్యే శంకర్ నాయక్ మాట్లాడుతూ… మోడీ తెలంగాణ పై కక్ష సాధింపు చేస్తున్నారన్నారు. కేసీఆర్‌ కుటుంబంపై టార్గెట్ చేస్తున్నారని, మతాన్ని వాడుకుంటూ దేశాన్ని పాలిస్తున్న మోడీ విధానము మార్చుకోవాలన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రం లో ఆర్యవైశ్య భవన నిర్మాణానికి ఒక ఎకరం స్థలాన్ని కేటాయిస్తామని హామీ ఇచ్చారు.

Also Read : GT vs KKR: పోరాడుతున్న కోల్‌కతా.. 10 ఓవర్లలో స్కోరు వివరాలు ఇలా..

Exit mobile version