Site icon NTV Telugu

Satyavathi Rathod : వార్డు మెంబర్‌ కాలేని షర్మిలను ప్రధాని పలకరించడం విడ్డూరం

Satyavathi Rathod

Satyavathi Rathod

మహబూబాబాద్ జిల్లా లోని మానుకోటలో ఈ నెల 15 లోపు ముఖ్యమంత్రి కేసిఆర్ పర్యటించనున్నారు. అయితే.. ఈ నేపథ్యంలో.. మెడికల్ కళాశాల, కలెక్టరేట్ భవనాలను మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే శంకర్ నాయక్, కలెక్టర్ శశాంక, అడిషనల్ కలెక్టర్ ఆభిలాష ఆభినవ్‌లు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్‌ మాట్లాడుతూ.. వార్డు మెంబర్, కాలేని వైయస్ షర్మిలను ప్రధాని పలకరించడం విడ్డూరమన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ జగన్ ఇద్దరు కూడా తెలంగాణ ద్రోహూలే అంటూ ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. మానుకోట, రాళ్ళుకు మరోసారి పని చెప్పకండీ అంటూ ఆమె వ్యాఖ్యానించారు. మాకంటే మానుకోట రాళ్లకు ఎక్కువ పౌరుషం వుంటుందన్న మంత్రి సత్యవతి.. నోరు..నాలిక అదుపులో పెట్టుకోని షర్మిల పాదయాత్ర చేసుకోవాని హితవు పలికారు.

 

Also Read : YS Jagan: బీసీల హృదయంలో జగన్‌.. జగన్‌ హృదయంలో బీసీలు

ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలును ఎంపీలను ఏమైనా అంటే టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ఊరుకోరని ఆయన వెల్లడించారు. దానికి మా బాధ్యత కాదని ఆమె అన్నారు. ఇదిలా ఉంటే… మహబూబాబాద్‌ జిల్లాలో ఏర్పాటు చేసిన మెడికల్‌ కళాశాల, కలెక్టరేట్‌ను సీఎం కేసీఆర్‌ త్వరలో ప్రారంభించనున్నారు. వైఎస్​ రాజశేఖరరెడ్డి అడ్డుపడకుంటే తెలంగాణ రాష్ట్రం ఏనాడో ఏర్పడేదని అన్నారు. గతంలో మీ అన్న జగన్ సమైక్యవాదిగా మహబూబాబాద్ పర్యటనకు వస్తున్న సమయంలో ఇక్కడి ప్రజలు రాళ్లతో తరిమికొట్టిన్రు. మానుకోట రాళ్లకు పని చెప్పే పరిస్థితి మళ్లీ తీసుకురావొద్దు అని షర్మిలను ఆమె హెచ్చరించారు.

Exit mobile version