NTV Telugu Site icon

YCP: సత్యవర్ధన్ కిడ్నాప్ వివాదం కేసు.. వీడియో విడుదల చేసిన వైసీపీ

Ycp

Ycp

సత్యవర్ధన్ కిడ్నాప్ వివాదం కేసులో కీలక ఆధారాలతో వైసీపీ ఓ వీడియో విడుదల చేసింది. వైసీపీ అధికారిక x ఖాతాలో పోస్ట్ చేసింది. ట్రూత్ బాంబ్ పేరిట ఎక్స్‌లో వైసీపీ ఓ వీడియోను రిలీజ్ చేసింది. తీవ్ర అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ.. తప్పుడు కేసులు, అక్రమ నిర్బంధాలతో చట్టాన్ని, న్యాయవ్యవస్థలను అపహాస్యం చేస్తున్న సర్కారు తీరుకు నిలువెత్తు నిదర్శనం అంటూ ఆ వీడియోను జత చేసింది. ఆ వీడియోలో బ్లూషర్ట్‌ వేసుకుని నింపాదిగా షాపింగ్ చేస్తున్న సత్యవర్థన్‌‌ను వల్లభనేని వంశీ కిడ్నాప్‌ చేశారంటూ పోలీసులు ఆరోపిస్తున్నారంది. వీడియోను చూస్తే సత్యవర్థన్‌ కిడ్నాప్‌నకు గురైనట్టుగా ఉందా అంటూ ప్రశ్నించింది. కిడ్నాప్‌ చేసి, నిర్బంధించిన వ్యక్తి బయటకు ఎలా వస్తారు.. ఇలా స్వేచ్ఛగా షాపింగ్‌ ఎలా చేస్తారు. పోలీసులు తప్పుడు కేసులు పెట్టి వారి కుటుంబ సభ్యులను భయపెట్టి, బెదిరించి తప్పుడు ఫిర్యాదు తీసుకున్నారని ఎక్స్ వేదికగా ఆరోపణలు సంధించింది వైసీపీ.

Read Also: Aadhi Pinisetty: ‘శబ్దం’ డిఫరెంట్ స్క్రీన్ ప్లే వున్న హారర్ ఫిల్మ్: హీరో ఆది పినిశెట్టి ఇంటర్వ్యూ

కాగా.. వల్లభనేని వంశీని కిడ్నాప్‌, బెదిరింపుల కేసులో పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం విదితమే. ఈ క్రమంలో.. వంశీ రిమాండ్‌ను మార్చి 11వ తేదీ వరకు పొడిగించింది కోర్టు. వంశీ సహా నిందితుల రిమాండ్ పొడిగించారు. మరోవైపు.. వంశీతో పాటు మరో ఇద్దరిని పోలీసులు మూడు రోజులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. మంగళవారం, బుధవారం వంశీని పోలీసులు విచారించారు. పోలీస్ కస్టడీలో వంశీపై పోలీసులు ప్రశ్నల వర్షం కురిపించారు. అనేక ప్రశ్నలకు తనకు తెలీదని వంశీ సమాధానం ఇచ్చారు.