NTV Telugu Site icon

Ayesha Meera Case: ఆయేషా మీరా కేసులో సత్యంబాబు కీలక వ్యాఖ్యలు..

Ayesha Meera Case

Ayesha Meera Case

Ayesha Meera Case: సంచలనం స‌ృష్టించిన బీ ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య కేసు మరోసారి తెరపైకి వచ్చింది.. ఈ కేసులో సీబీఐ అధికారులు మరోసారి దర్యాప్తు చేపట్టారు.. ఈ కేసులో కొన్నేళ్లపాటు జైలు జీవితం గడిపిన సత్యంబాబు.. నిర్దోషిగా బయటకు వచ్చాడు.. దీంతో కోర్టు తేల్చడంతో.. మరోసారి దర్యాప్తు ప్రారంభించింది సీబీఐ.. అయితే, ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయేషా మీరా కేసులో నిర్దోషిగా తేలిన సత్యం బాబు.. కీలక వ్యాఖ్యలు చేశారు.. ఆయేషా మీరా హత్య కేసులో నిందితులు ఎవరో ఆయేషా తల్లి మొదటి నుంచి చెబుతూనే ఉన్నారన్నారు.. ఈ కేసులో పోలీసులు నన్ను అక్రమంగా ఇరికించారని ఆవేదన వ్యక్తం చేశాడు.. సీబీఐ ఇప్పటి వరకు నాలుగు సార్లు విచారించింది.. కానీ, రెండేళ్లుగా నాకు సీబీఐ నుంచి పిలుపురాలేదు.. మళ్లీ సీబీఐ పిలిస్తే వెళ్లి కేసు విచారణకు అన్ని విధాలుగా సహకరిస్తానని పేర్కొన్నాడు.

Read Also: CM YS Jagan: ‘సోషల్‌ మీడియా’ వేధింపులపై ప్రత్యేక విభాగం..!

పోలీసులు ఎలా కేసులు పెట్టారు, ఎలా ఇబ్బంది పడ్డాను అనే విషయాలు సీబీఐకి ఇప్పటికే వివరించానని తెలిపాడు సత్యంబాబు.. ఆయేషా మీరా హత్య కేసులో అసలు దోషులను పట్టుకుని ఆమె కుటుంబ సభ్యులకు న్యాయం జరగాలని డిమాండ్‌ చేశాడు.. 15 ఏళ్లు అవుతున్నా కేసులో నిందితులు పట్టుబడలేదని వాపోయాడు. హైకోర్టు నన్ను నిర్ధోషిగా తేల్చిన సమయంలో.. నాకు నష్ట పరిహారం, పొలం, ఇల్లు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది.. కానీ, అవేమీ నాకు ఇప్పటి వరకు అందలేదన్నాడు.. నేను కలెక్టర్ కి స్పందనలో ఫిర్యాదు చేసినా పేపర్స్ వేస్ట్ అయ్యాయి తప్ప న్యాయం జరగలేదంటూ ఆవేదన వ్యక్తం చేశాడు సత్యంబాబు..