Satyakumar: నిన్న విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పదాధికారుల సమావేశానికి సీనియర్ నేతలు హాజరుకాకపోడం చర్చగా మారింది.. అయితే, ఎన్నికల్లో సీట్లు దక్కకపోవగడంతోనే ఆ నేతలు కీలక సమావేశానికి డుమ్మాకొట్టారనే ప్రచారం జరిగింఇ.. దీనిపై స్పందించిన బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్.. ఆ ప్రచారాన్ని కొట్టిపారేశారు.. ఈరోజు బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చిన ఆయన.. ఇవాళ బీజేపీ అసెంబ్లీ అభ్యర్థుల లిస్టు వచ్చే అవకాశం ఉందన్నారు. అరుణ్ సింగ్, సిద్ధార్ధ సింగ్ ను కలవడానికి తాను వచ్చానన్న ఆయన.. నిన్న ఇతర రాష్ట్రాలలో పని ఉండి.. సమావేశానికి రాలేకపోయానని స్పష్టం చేశారు. కానీ, బయట జరుగుతోన్న ప్రచారాల్లో ఎటువంటి వాస్తవం లేదన్నారు. అంతేకాదు.. మేం ప్రధాని నరేంద్ర మోడీ కోసం పని చేస్తున్నాం.. అక్కడక్కడా అసంతృప్తులు ఉన్నా సర్దుకుంటాయన్నారు. వైసీపీలో అందరూ వేరే పార్టీ నుంచి వచ్చినవాళ్లే అని ఎద్దేవా చేశారు. పార్టీ నిర్ణయమే మాకు శిరోధార్యం.. నా పోటీ జాతీయ స్ధాయిలోనా, రాష్ట్ర స్ధాయిలోనా అనేది అధిష్టానం నిర్ణయిస్తుందన్నారు బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్.
Read Also: Volunteers Resignation: రాజమండ్రిలో వాలంటీర్ల సామూహిక రాజీనామాలు..