AP Panchayat Elections: రామాలయ నిర్మాణం కోసం గ్రామస్తుల వినూత్న నిర్ణయం.! సర్పంచ్ పదవి వేలం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Panchayat Elections: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు హీట్ పెంచుతున్నాయి.. మరోవైపు.. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి తొలి విడత నోటిఫికేషన్ విడుదలైంది.. ఇంకోవైపు.. పంచాయతీలను కైవసం చేసుకోవడానికి.. ఏకగ్రీవ ఎన్నిక కోసం ప్రయత్నాలు ముమ్మరంగా సాగిస్తున్నారు స్థానిక నేతలు.. అయితే అనంతపురం జిల్లాలో మరో కోణం వెలుగు చూసింది.. గ్రామంలో సర్పంచ్ పదవిని దక్కించుకునేందుకు ఏకంగా రూ.29 లక్షలు ప్రకటించడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం కొప్పలకొండ గ్రామంలో సర్పంచ్ పదవికి వేలంపాట నిర్వహించారు.. ఈ వేలంపాటను గ్రామ పెద్దలు రూ.10 లక్షలతో ప్రారంభించగా.. ఓ వ్యక్తి సర్పంచ్ పదవిని దక్కించుకునేందుకు రూ.29 లక్షలు చెల్లించేందుకు ముందుకొచ్చారు..
గ్రామంలో శ్రీరామాలయాన్ని నిర్మించాలనే సంకల్పంతో గ్రామస్తులంతా కలిసి ఈ వినూత్న నిర్ణయం తీసుకున్నారు.. ఆలయ నిర్మాణానికి అవసరమైన నిధులను సమకూర్చుకోవడమే లక్ష్యంగా సర్పంచ్ పదవికి వేలంపాట నిర్వహించాలని నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోంది. గ్రామస్తులందరూ ఒకే నిర్ణయానికి వచ్చి ఈ ప్రక్రియ చేపట్టడం విశేషంగా మారింది. సర్పంచ్ పదవికి రూ.29 లక్షల భారీ మొత్తాన్ని ప్రకటించడంతో ఈ విషయం చుట్టుపక్కల గ్రామాల్లోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. గ్రామంలో రామాలయ నిర్మాణం కోసం చేపట్టిన ఈ నిర్ణయం ప్రస్తుతం స్థానికంగా హాట్ టాపిక్‌గా మారింది. సర్పంచ్ పదవి కోసం వేలంపాట నిర్వహించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.. చివరకు రూ.29 లక్షలు వేలం పాట పాడిన ఎల్ఐసీ ఆదినారాయణ సర్పంచ్ పదవి దక్కించుకున్నట్టు అయ్యింది.. వేలం పాట ముగియనగానే అంతా ఒకే సారి జై శ్రీరాం అంటూ నినాదాలు చేశారు.. కాగా, ఇప్పటికే కొన్ని గ్రామ పంచాయతీల్లో కోట్ల రూపాయలు ఇచ్చేందుకు.. భూమి సైతం గ్రామానికి రాసి ఇచ్చేందుకు పలువురు ముందుకు వచ్చిన విషయం విదితమే..
Also Read
- JC Prabhakar Reddy: అనంతపురం అభివృద్ధికి మేయర్ పార్టీ మారాలి.. జేసీ ప్రభాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు!
- Teacher Dies During Election Duty: ఎన్నికల విధుల్లో ప్రాణాలు కోల్పోయిన టీచర్.. చంద్రబాబు, పవన్, లోకేష్ సంతాపం
- Rapthadu School Attack : రాప్తాడు విద్యార్థినిపై దాడి కేసులో ట్విస్ట్.. పోలీసుల కాల్పుల్లో నిందితుడికి గాయాలు..
- Thopudurthi Prakash Reddy: తోపుదుర్తిపై నాన్ బెయిలబుల్ సెక్షన్లతో కేసు.. ఏ క్షణంలోనైనా అరెస్ట్..?
తాజావార్తలు
-
Dhurandhar 2 vs Ramayan: ‘ధురంధర్ 2’ వర్సెస్ ‘రామాయణ’.. రెండో శుక్రవారం కలెక్షన్లలో టాప్ మూవీ ఏదంటే?
-
AP Panchayat Elections: రామాలయ నిర్మాణం కోసం గ్రామస్తుల వినూత్న నిర్ణయం.! సర్పంచ్ పదవి వేలం..
-
IPL 2027-KKR: వాటా విక్రయించనున్న మెహతా గ్రూప్.. కేకేఆర్‌పై ఆసక్తి చూపుతున్న కంపెనీ ఏదంటే!
-
Hyderabad: డిజిటల్ అరెస్ట్ వలలో చిక్కుకున్న రిటైర్డ్ రక్షణ శాఖ అధికారి.. రూ. 72.30 లక్షలు స్వాహా..
-
Cyclone Alert: ఏపీకి మరో తుఫాన్ ముప్పు..? విశాఖ–మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం..!
ట్రెండింగ్
-
India All Out List: వన్డేల్లో టీమిండియాకు ఘోర పరాభవం.. 100 లోపే భారత్ ఇన్నిసార్లు ఆలౌట్ అయిందా?
-
Children’s Day 2026 : మార్కుల వేట వద్దు.. పిల్లల్లో క్రియేటివిటీ పెంచండి
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్‌పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!
-
Matt Henry: భారత్‌ను మడతెట్టెస్తున్న మాట్ హెన్రీ.. ఇది మూడోసారి.. ఏకంగా 8 వికెట్స్!