NTV Telugu Site icon

Saripodhaa Sanivaaram: అక్కడ ప్రీ సేల్స్ తో అదరకొడుతున్న నాని “సరిపోదా శనివారం”..

Saripodhaa Sanivaaram

Saripodhaa Sanivaaram

Saripodhaa Sanivaaram: టాలీవుడ్ హీరోలలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా స్వతహాగా ఎదిగిన యాక్టర్స్ లో నాచురల్ స్టార్ నాని కూడా ఒకడు. విభిన్న కథ అంశాలను ఎంచుకుంటూ తనదైన శైలితో సినిమాలను చేసుకుంటూ అనేకమంది ప్రేక్షకులను సంపాదించుకున్నాడు నాని. ఇకపోతే., తాజాగా నాచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ” సరిపోదా శనివారం “. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ను వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఆగస్టు 29, 2024 న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను రిలీజ్ కావడానికి రెడీ అయింది. సినిమాలో హీరో నాచురల్ స్టార్ నాని పక్కన హీరోయిన్ గా ప్రియాంక మోహన్ నటించింది.

Murari: సూపర్ స్టార్ క్రేజ్ మాములుగా లేదుగా.. 2 రోజుల్లో 7 కోట్లకి పైగా వసూళ్లు..

సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడడంతో మూవీ మేకర్స్ ప్రమోషన్ వేగవంతం చేశారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుండి విడుదలైన పలు చిత్రాలు ప్రేక్షకుల్లో మంచి హైపును క్రియేట్ చేశాయి. ముఖ్యంగా సినిమా పోస్టర్లు, హీరో నాని రెండు చేతులను ఇనుప గొలుసులతో ఉన్న పోస్టర్ ను చూస్తే సినిమాలో మాస్ ఎలిమెంట్స్ భారీ రేంజ్ లో ఉండబోతున్నట్లు అర్థమవుతోంది. ఇకపోతే, ఈ చిత్రానికి సంబంధించి తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తెలుస్తోంది.

100 Variety Foods: 100 రకాల పిండి వంటలతో అల్లుడికి ఘనస్వాగతం పలికిన అత్తమామలు..

” సరిపోదా శనివారం ” సినిమాని అమెరికాలో డిస్ట్రిబ్యూట్ చేస్తున్న ప్రత్యంగిరా సినిమాస్ తాజాగా సోషల్ మీడియా ద్వారా ఓ పోస్టును చేసింది. ఈ సినిమాకు సంబంధించి ప్రీ సేల్స్ తో నాని దూకుడు ప్రదర్శిస్తున్నట్లు పోస్టులో పేర్కొంది. అంతేకాకుండా., ఈ సినిమాతో మరోసారి నాని బ్లాక్ బ్లాస్టర్ విజయాన్ని అందుకోవడానికి రెడీ అవుతున్నాడని తెలిపింది. ఈ సినిమాలో ఎస్ జె సూర్య కీలకపాత్రలో నటిస్తుండగా.. జేక్స్ జెబోయి సంగీతాన్ని అందిస్తున్నారు.

Show comments