Site icon NTV Telugu

Saripodhaa Sanivaaram : యూఎస్ మార్కెట్ లో సెన్సేషన్ సృష్టించిన ‘సరిపోదా శనివారం’

Saripodaa Sanivaram

Saripodaa Sanivaram

Saripodhaa Sanivaaram : నేచురల్ స్టార్ నాని వరుస పెట్టి సినిమాలతో దూసుకుపోతున్నాడు. దసరా, హాయ్ నాన్న చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్ కొట్టాడు. తాజాగా మరోసారి హిట్ అందుకునేందుకు సరిపోదా శనివారంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అంటే సుందరానికీ డైరెక్టర్‌ వివేక్ ఆత్రేయ ఈ సినిమాను తెరకెక్కించారు. నాని, వివేక్ ఆత్రేయ కాంబినేషన్‌లో వచ్చిన సరిపోదా శనివారం పాన్ ఇండియా స్థాయిలో విడుదల అయింది. తెలుగుతోపాటు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో గురువారం రిలీజ్ అయింది. ఇప్పటికే ఈ సినిమా ఓవర్సీస్ ప్రీమియర్స్ పడిపోయాయి. అవి చూసిన నెటిజన్స్ సరిపోదా శనివారంపై రివ్యూలు ఇస్తున్నారు.

Read Also:MLC Kavitha: నేడు కేసీఆర్‌ను కలువనున్న ఎమ్మెల్సీ కవిత..

సినిమాలో హీరో ఎంట్రీతో పాటు ఇంటర్వెల్ ట్విస్ట్, క్లైమాక్స్ యాక్షన్ సీన్స్ చాలా బాగున్నాయని, గూస్ బంప్స్ తెప్పించాయని అంటున్నారు. నానికి జోడిగా ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ నటించారు. పాన్ ఇండియా భాషల్లో గట్టి ప్రమోషన్ల నడుమ విడుదలైన ఈ చిత్రం భారీ బుకింగ్స్ ని తెలుగు రాష్ట్రాలతో సహా యూఎస్ మార్కెట్ లో కూడా నమోదు చేస్తుంది. అయితే ఈ చిత్రం అమెరికా మార్కెట్లో అదరగొడుతుందనే చెప్పాలి. నాని నిలకడ క్రేజ్‎తో సాలిడ్ ప్రీ సేల్స్ బుకింగ్స్ అందుకుంది. ఈ చిత్రం ఇప్పుడు కేవలం ప్రీ సేల్స్ తోనే హాఫ్ మిలియన్ మార్క్ దగ్గరకు వెళ్లిపోయింది. అక్కడ ఏకంగా నాలుగు లక్షల 50 వేల డాలర్లు కి పైగా వసూళ్లు సాధించింది. ఇది భారీ మొత్తమే అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి డే1 నుంచి వసూళ్లు ఎలా ఉంటాయో చూడాలి. మరి ఈ సినిమాకి జేక్స్ బిజొయ్ సంగీతం అందించారు. అలాగే డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

Read Also:Shiva Rerelease: కింగ్ నాగ్ అభిమానులకు “మాస్” థియేటర్స్ లో ఊహించని గిఫ్ట్..

Exit mobile version