NTV Telugu Site icon

Sarfaraz Khan-IPL 2024: సర్ఫరాజ్‌ ఖాన్‌కు లక్కీ ఛాన్స్‌.. అప్పుడు వద్దన్నవాళ్లే..!

Sarfaraz Khan Bat

Sarfaraz Khan Bat

Sarfaraz Khan IPL Re-Entry: టీమిండియా నయా సంచలనం సర్ఫరాజ్‌ ఖాన్‌.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌)లో రీఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 17వ సీజన్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ ప్రాంచైజీకి సర్ఫరాజ్‌ ప్రాతినిథ్యం వహించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. సర్ఫరాజ్‌తో గుజరాత్‌ మేనేజ్మెంట్ చర్చలు జరిపినట్లు, త్వరలోనే అతడు జట్టులో జాయిన్ అవ్వనున్నట్లు తెలిసింది. ఈ విషయంపై అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది.

ఐపీఎల్ 2024 మినీ వేలంలో రూ.3.6 కోట్లకు కొనుగోలు చేసిన భారత యువ వికెట్ కీపర్ రాబిన్ మింజ్ కొద్ది రోజుల క్రితం బైక్ ప్రమాదానికి గురయ్యాడు. దీంతో మింజ్ 17వ సీజన్‌ మొత్తానికి దూరమయ్యాడు. అతడి స్ధానాన్ని సర్ఫరాజ్‌ ఖాన్‌తో భర్తీ చేయాలని గుజరాత్‌ టైటాన్స్‌ మేనెజ్‌మెంట్‌ నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో సర్ఫరాజ్‌ అదరగొట్టడంతో.. గుజరాత్‌ తమ జట్టులోకి తీసుకునేందుకు సిద్దమైంది. ఇంగ్లండ్‌పై సర్ఫరాజ్‌ వరుస హాఫ్ సెంచరీలు చేసిన విషయం తెలిసిందే.

Also Read: Ee Sala Cup Namdu: ‘ఈ సారి కప్ మాదే’ కాదు.. ‘ఈ సారి కప్ మాది’: స్మృతి మంధాన

ఐపీఎల్‌ 2023లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున సర్ఫరాజ్‌ ఖాన్ ఆడాడు. 2024 వేలానికి ముందు ఢిల్లీ అతడిని విడుదల చేసింది. దీంతో రూ.20 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన సర్ఫరాజ్‌ను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. ఇప్పుడు అతడికి లక్కీ ఛాన్స్‌ వచ్చే అవకాశం ఉంది. అప్పుడు వద్దన్నవాళ్లే ఇప్పుడు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. గతంలో ఢిల్లీ క్యాపిటల్స్‌, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్లకు సర్ఫరాజ్‌ ప్రాతనిథ్యం వహించాడు. ఐపీఎల్‌లో ఇప్పటివరకు 50 మ్యాచ్‌లు ఆడి కేవలం 585 పరుగులు చేశాడు. ఇందులో ఒక హాఫ్ సెంచరీ మాత్రమే ఉంది. ఐపీఎల్ 2024 మార్చి 22 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.

Show comments