NTV Telugu Site icon

Boora Narsaiah Goud: ఈ నెల 26న సర్వాయి పాపన్న పోస్టల్‌ కవర్ విడుదల

Boora Narsaiah

Boora Narsaiah

Boora Narsaiah Goud: తన కోరిక మేరకు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్‌ పోస్టల్‌ కవర్‌ విడుదల చేయడానికి కేంద్రం ఒప్పుకుంటే.. టీఆర్‌ఎస్‌ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ వల్లే వచ్చిందని గప్పాలు కొట్టుకుంటున్నారని బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్ ఎద్దేవా చేశారు. మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌కు చిత్తశుద్ధి ఉంటే తన పరిధిలో ఉన్న ట్యాంక్ బండ్‌పైన సర్దార్‌ సర్వాయి పాపన్న గౌడ్, చాకలి ఐలమ్మ, కృష్ణ స్వామి ముదిరాజ్, ధర్మభిక్షం గౌడ్‌ల విగ్రహాలు పెట్టాలన్నారు. తాను అడిగిన వెంటనే సర్దార్‌ సర్వాయి పాపన్న గౌడ్ పోస్టల్ కవర్ విడుదల చేసిన కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు.

Bandi Sanjay: గంటలో మూడుసార్లు.. సంజయ్ ‘బండి’ తనిఖీలు

ఈ నెల 26న హైదరాబాద్‌లో అధికారికంగా పోస్టల్ కవర్ ను విడుదల చేస్తారని చౌటుప్పల్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన తెలిపారు. బహుజనులకు బీజేపీ న్యాయం చేస్తుందని నమ్మానన్న ఆయన.. అదే ఈ రోజు నిజం అయ్యిందన్నారు. సర్వాయి పాపన్నకు జాతీయ స్థాయిలో గుర్తింపు ఇవ్వాలని బీజేపీలో చేరిన వెంటనే అమిత్ షా, నడ్డాలను కోరానని గుర్తు చేస్తూ.. సర్దార్ పాపన్న పోస్టల్ కవర్‌ను విడుదల చేసేందుకు నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు. బీజేపీ పాలిత రాష్ట్రాలతో పోల్చుకున్నప్పుడు, గుజరాత్‌లో లాగా తెలంగాణలో కూడా మద్యపాన నిషేధం అమలు చేయాలన్నారు. ఈనెల 27 న చౌటుప్పల్ లో గౌడ సంఘాల ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేస్తున్నామని.. పార్టీలకు అతీతంగా గీత కార్మికులు హాజరుకావాలని కోరారు. కేవలం బెల్ట్ షాపుల వల్ల ఒక సంవత్సరానికి 40 వేల కోట్లు వస్తున్నాయని.. ఈ నిధులతోనే తెలంగాణలో పథకాలు నడుస్తున్నాయని విమర్శించారు.