Site icon NTV Telugu

Sara Tendulkar: ఆయన నెంబర్‌వన్‌ అయ్యాడు.. ఈమె ఓపెన్‌ అయ్యింది!

Cricket

Cricket

Sara Tendulkar: యువ క్రికెటర్ శుభ్‌మన్ గిల్‌ను భారత క్రికెట్ భవిష్యత్ సూపర్ స్టార్‌గా అభివర్ణిస్తున్నారు క్రికెట్ పండితులు. 20 ఏళ్ల వయసులోనే భారత జట్టులోకి అడుగు పెట్టి ఇప్పటికే బోలెడన్ని మంచి ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఐపీఎల్‌లోనూ పరుగుల వరద పారించాడు. క్రికెటర్‌గా చాలా పద్ధతి, క్రమశిక్షణతో కనిపించే శుభ్‌మన్ గిల్.. వ్యక్తిగత జీవితంలో ఇప్పటికే కమిట్ అయిపోయాడనే ప్రచారం చాన్నాళ్లుగా నడుస్తోంది. సచిన్ కూతురు సారాతో అతను ప్రేమలో ఉన్నట్లుగా సామాజిక మాధ్యమాల్లో ఎప్పట్నుంచో ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉండగా.. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్‌ను వెనక్కినెట్టి వన్డే ల్లో వరల్డ్ నెంబర్ 1 బ్యాటర్‌గా శుభ్ మన్ గిల్ నిలిచాడు. సచిన్, ధోనీ, కోహ్లీ తర్వాత వరల్డ్ నెం.1 బ్యాటర్ గా నిలిచిన నాలుగో ఇండియన్ ప్లేయర్‌గా గిల్ ఆ ఘనతను సాధించాడు. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో వరల్డ్ నెంబర్ వన్ ర్యాంక్ సాధించిన చిన్న వయస్కుడిగా గిల్ రికార్డు సృష్టించాడు. ఈ విషయంలో సచిన్ రికార్డును శుభ్‌మన్ గిల్ బ్రేక్ చేశాడు.

Also Read: Gayathri Raghuram: అయ్యో.. బాపు బొమ్మ ఏంటీ .. ఇలా గుర్తుపట్టలేనంతగా మారిపోయింది

ఐసీసీ ర్యాంకింగ్స్‌లో వరల్డ్ నెంబర్ 1 బ్యాటర్‌గా నిలిచిన శుభ్‌మన్‌ గిల్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సచిన్‌ కూతురు సారా టెండూల్కర్‌ కూడా వరల్డ్‌ నెంబర్‌వన్‌ బ్యాట్స్‌మన్‌ శుభాకాంక్షలు తెలిపింది. ట్విట్టర్‌ వేదికగా ‘వరల్డ్‌ నెంబర్‌ వన్‌ బ్యాట్స్‌మెన్ శుభ్‌మన్‌ గిల్’ అని క్యాప్షన్‌ రాసి లవ్‌ ఎమోజీతో పాటు ముద్దు సింబల్ పెట్టింది. దీంతో వారి మధ్య ఉన్న అనుబంధం బయటపడిందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. చివరగా సారా చాలా సంతోషంగా ఉందంటూ, లిటిల్ మాస్టర్‌ బ్లాస్టర్ శుభ్‌మన్‌ గిల్‌ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

ఇటీవల తనకు, శుభ్‌మన్‌కు మధ్య ఏమీ లేదని చెబుతూనే.. అతను సచిన్ కూతురు సారాతో ప్రేమలో ఉన్నట్లుగా చెప్పకనే చెప్పింది సారా అలీ ఖాన్. సచిన్ కూతురు గురించి పరోక్షంగా మాట్లాడాలన్నా చాలా ఆలోచించాల్సిందే. ఆమె మాటల్ని బట్టి చూస్తే శుభ్‌మన్ గిల్‌, సారా టెండూల్కర్ నిజంగానే ప్రేమలో ఉన్నారని అనుకోవాలి. ఇటీవల ప్రపంచకప్ మ్యాచ్‌లకు కూడా సారా హాజరవడం.. శుభ్‌మన్ ఇన్నింగ్స్‌లు చూస్తూ ఉత్సాహంగా కనిపించడం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. తాజాగా లవ్‌ ఎమోజీతో పాటు ముద్దు సింబల్‌ పెట్టి గిల్‌కు శుభాకాంక్షలు చెప్పడం ఆ ఊహాగానాలు నిజమే అనిపిస్తోంది.

https://twitter.com/SaraTendulkar__/status/1722176138959810864

 

Exit mobile version