NTV Telugu Site icon

Vikarabad: ఎన్నికల వేళ తెలంగాణ- కర్ణాటక సరిహద్దులో మళ్లీ సారా తయారీ కేంద్రాలు

Vikarabad

Vikarabad

వికారాబాద్ జిల్లా పెద్దెముల్ మండలంలోని మారుముల ప్రాంతం తట్టేపల్లి గ్రామానికి పక్కనే కర్ణాటక రాష్ట్రం అనుకుని ఉండడంతో అక్కడ ఉన్న అటవీ ప్రాంతంలో కొంత మంది సారాయి తయారు కేంద్రాలను సృష్టిస్తున్నారు. దీనికి కొంత మంది రాజకీయ నాయకులు కూడా అండగా ఉంటూ తక్కువ ధరకే సారాయి లభించడంతో ఓటర్లను ఆకర్షించుకోవడానికి మత్తులో దించేందుకు సారా కేంద్రాల వైపై మొగ్గుచూపుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Read Also: Ghaziabad: ఘజియాబాద్‌లో కుమార్ విశ్వాస్ కాన్వాయ్‌పై దాడి.. పోలీసుల విచారణలో భిన్న కథనం

అయితే, తాజాగా తట్టేపల్లి శివారులోని అటవీ ప్రాంతంలో సారాయి తయారీ కేంద్రం నిర్వహిస్తున్నారు అనే సమాచారంతో జిల్లా టాస్క్ ఫోర్స్ అధికారులతో కలిసి స్థానిక పోలీసులు సోదాలు చేసి సారా తయారు చేస్తున్న బట్టిలో 250 లీటర్ల బెల్లం పానకాన్ని సారాకి ఉపయోగించే వస్తువులను ధ్వంసం చేశారు. 20 లీటర్ల సారాని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సారా బట్టి నెలకొల్పిన రాంజీ అనే వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Read Also: Telangana Assembly Elections 2023: తెలంగాణలో కొనసాగుతున్న నామినేషన్ల పర్వం.. లైవ్ అప్‌డేట్స్

ఇక, టాస్క్ ఫోర్స్ అధికారులు స్థానికుల పోలీసులు కలిసి దాడులు నిర్వహిస్తున్న ఎక్సైజ్ అధికారులు మాత్రం నిమ్మకు నీరెట్టినట్లు వ్యవహరిస్తున్నారు. కనీసం వారు క్షేత్రస్థాయిలో కూడా పర్యవేక్షించకపోతున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. తెలంగాణ సరిహద్దులో ఈ ప్రాంతం ఉండడంతో ఉన్నత అధికారుల పర్యవేక్షణ కొరవడం వల్ల కిందిస్థాయి ఎక్సైజ్ అధికారులు సారా కేంద్రాలకు పరోక్షంగా మద్దతు పలుకుతున్నారు అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. తక్కువ ధరకే ఈ సారా దొరకడంతో పాటు ఎన్నికల టైం కావడంతో గ్రామాల్లో సారా జోరు పెరిగి తాగిన మత్తులో ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే అవకాశం ఉందన్న సోయి కూడా ఎక్సైజ్ అధికారులకు లేదని విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు మారుమూల ప్రాంతాలను సందర్శించి సారా బట్టి కేంద్రాలను నిర్మూలించాలని పలువురు కోరుతున్నారు.

Show comments