Site icon NTV Telugu

Sara alikhan: డబ్బును పొదుపు చేస్తే రెట్టింపు సంపాదించినట్లే అంటున్న సారా అలీ ఖాన్..!!

Sara Ali Khan Enjoying A Satisfying And Exciting Phase In Her Career 001

Sara Ali Khan Enjoying A Satisfying And Exciting Phase In Her Career 001

హీరోయిన్లు చిన్నచిన్న వాటి కోసం చేసే ఖర్చుల విషయంలో అంతగా పట్టించుకోరు. పొదుపు చేసే హీరోయిన్ లు ఇప్పుడు మనకు అస్సలు కనపడరు.కొంతమంది హీరోయిన్లు డ్రెస్, షూస్ కోసం కొన్ని లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. బ్రాండ్స్ విషయంలో హీరోయిన్లు ఎన్నో జాగ్రత్తలను తీసుకుంటారనే విషయం తెలిసిందే. అయితే సారా అలీ ఖాన్ అయితే కేవలం 400 రూపాయల కోసం వెరైటీగా ప్రవర్తించడం హాట్ టాపిక్ గా మారింది.సారా అలీ ఖాన్ మహా పొదుపరి అంటూ కొంతమంది నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తుండటం విశేషం.తాజాగా ఈ హీరోయిన్ మాట్లాడుతూ ఒక స్టార్ హోటల్ లో తనకు ఎదురైన అనుభవం గురించి వారు పంచుకున్నారు. ఇటీవల తాను విదేశాలకు వెళ్లగా అక్కడ రోమింగ్ కోసం 400 రూపాయలు చెల్లించాలని హోటల్ వాళ్లు అడిగారని ఆమె చెప్పుకొచ్చారు.

ఒక్కరోజు రోమింగ్ కోసం అంత మొత్తం చెల్లించాలా అని తాను తన మేకప్ మ్యాన్ ను హాట్ స్పాట్ ఆన్ చేయాలని కోరానని సారా అలీ ఖాన్ తెలిపారు.అక్కడ ఉన్న ఇతర నటీనటులను ఇదే విషయం గురించి అడగగా వాళ్లు 3000 రూపాయలు ఖర్చు చేసి నెల రోజులకు ప్యాకేజ్ తీసుకున్నామని కూడా చెప్పడంతో నేను షాకయ్యానని సారా అలీ ఖాన్ కామెంట్లు కూడా చేశారు. నా దృష్టిలో డబ్బులను పొదుపు చేస్తే రెట్టింపు సంపాదించినట్టే అని ఆమె చెప్పుకొచ్చారు.సారా అలీఖాన్ చేసిన కామెంట్లపై కొంతమంది పాజిటివ్ గా స్పందిస్తుంటే మరి కొందరు ఎంతో నెగిటివ్ గా స్పందిస్తున్నారు. సారా అలీ ఖాన్ డబ్బుకు ఎంతో విలువ ఇస్తారని ఆమె సన్నిహితులు కూడా చెబుతున్నారు. 400 రూపాయలు పొదుపు చేయడం ద్వారా సారా అలీ ఖాన్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారారు.. సారా అలీ ఖాన్ కెరీర్ విషయంలో కూడా ఆచితూచి నిర్ణయం తీసుకుంటున్న విషయం తెలిసిందే.

Exit mobile version