Ae Watan Mere Watan : నేరుగా ఓటీటీలోకి వచ్చేస్తున్న సారా అలీ ఖాన్ మూవీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా జరిగిన స్వాతంత్య్ర పోరాటం బ్యాక్‌డ్రాప్‌లో ‘ఏ వతన్ మేరే వతన్’ చిత్రం తెరకెక్కింది . ఈ సినిమాలో బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్ ప్రధాన పాత్ర పోషిస్తుంది.బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా 1940ల్లో రేడియో స్టేషన్ నిర్వహించిన భారత స్వాతంత్య్ర సమర యోధురాలు ఉషా మెహతా జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ మూవీకి కన్నన్ అయ్యర్ దర్శకత్వం వహించారు. ఈ ‘ఏ వతన్ మేరే వతన్’ సినిమా ట్రైలర్‌ను అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‌ఫామ్ నేడు (మార్చి 4) రిలీజ్ చేసింది.గాంధేయవాదిగా ఉండే ఉషా మెహతా (సారా అలీ ఖాన్) కాలేజీ రోజుల నుంచే భారత స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొనే అంశంతో ‘ఏ వతన్ మేరే వతన్’ ట్రైలర్ మొదలైంది.
ప్రమాదమని తెలిసినా.. కుటుంబ సభ్యులు వారించినా కూడా ఉషా మెహతా ఉద్యమంలో పోరాడుతూనే ఉంటారు. ఈ క్రమంలో స్వాతంత్య్ర ఉద్యమకారుల్లో స్ఫూర్తిని నింపేందుకు ఆమె ప్రత్యేకంగా ఓ రేడియో ఛానెల్ ను ప్రారంభిస్తారు. ఈ రేడియో స్టేషన్ ఎక్కడుందో గుర్తించి ధ్వంసం చేసేందుకు బ్రిటీషర్ వారు ప్రయత్నిస్తారు. అయితే, ఎవరికీ తెలియని ప్రాంతంలో రహస్యంగా ఈ రేడియో స్టేషన్‌ను నిర్వహిస్తూ.. స్వాతంత్య్ర ఉద్యమానికి ఊతమిస్తుంటారు ఉషా.ఉషా మెహతా జీవితం, రేడియో స్టేషన్‌తో ఆమె చేసిన స్వాతంత్య్ర పోరాటం గురించి ‘ఏ వతన్ మేరే వతన్’ చిత్రం తెరకెక్కింది.ఈ మూవీ ట్రైలర్ ఆద్యంతం ఇంట్రెస్టింగ్గా సాగింది. పీరియాడిక్ సెటప్ కూడా పర్ఫెక్ట్గా కనిపించింది.. ఈ ట్రైలర్లో బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఆకట్టుకుంది.’ఏ వతన్ మేరే వతన్’ చిత్రంలో ఉషా మెహతాగా సారా అలీ ఖాన్ నటించగా.. రామ్ మనోహర్ లోహియా పాత్రను ఇమ్రాన్ హష్మి పోషించారు. ఈ చిత్రంలో సచిన్ ఖేడేకర్,అభయ్ వర్మ, స్పర్ష్ శ్రీవాత్సవ్, అలెక్స్ ఓ నెల్ మరియు ఆనంద్ తివారీ కీలకపాత్రలు పోషించారు.
Also Read
- Donald Trump: ఓ వైపు డీల్, మరోవైపు ఇజ్రాయిల్ దాడులు.. ట్రంప్ తీవ్ర అసంతృప్తి..
- TMC Crisis: బెంగాల్ రాజకీయాల్లో సంచలనం.. ‘‘నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ’’లో టీఎంసీ ఎంపీలు విలీనం..
- INDW Vs PAKW: రీచా ఘోష్ మెరుపు ఇన్నింగ్స్.. పాకిస్థాన్ ముందు భారత్ టార్గెట్ ఎంతంటే..
- Harmanpreet Kaur: రోహిత్ శర్మ రికార్డును బద్దలు కొట్టిన హర్మన్‌ప్రీత్ కౌర్.. దేశ చరిత్రలోనే తొలి ప్లేయర్‌గా..
తాజావార్తలు
-
Women’s T20 World Cup 2026 : పాకిస్తాన్‌ను చిత్తు చేసిన భారత్.. దీప్తి శర్మ ఐదు వికెట్ల సునామీ.!
-
Donald Trump: ఓ వైపు డీల్, మరోవైపు ఇజ్రాయిల్ దాడులు.. ట్రంప్ తీవ్ర అసంతృప్తి..
-
CM Chandrababu : కృష్ణానది పడవ ప్రమాదంపై సీఎం చంద్రబాబు తీవ్ర విచారం.. మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటన
-
Nag Ashwin: ‘మాయాబజార్’ సెట్స్ చూసిన మహానుభావుడితో సినిమా.. ఎమోషనల్ అయిన స్టార్ ప్రొడ్యూసర్!
-
TMC Crisis: బెంగాల్ రాజకీయాల్లో సంచలనం.. ‘‘నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ’’లో టీఎంసీ ఎంపీలు విలీనం..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నాన్-స్టిక్ అవసరమే లేదు.. ఈ ట్రిక్‌తో స్టీల్ పాత్రలే సూపర్.!
-
Child Safety Tips : స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి.. పిల్లలకు ఈ 5 ‘అబద్ధాలు’ నేర్పించండి..!
-
Cleaning Hacks : పరుపు, దిండు నుంచి వాసన వస్తోందా.? ఈ ఒక్క చిట్కాతో నిమిషాల్లో ఫ్రెష్.!
-
Kitchen Tips : బియ్యాన్ని ఇలా కడగకపోతే అన్నం రుచి, ఆరోగ్యం రెండూ దెబ్బే.!
-
Rahamathullah Gurbaj: నా సెంచరీకి కారణం గౌతమ్ గంభీర్.. అఫ్గాన్ ఓపెనర్ ఆసక్తికర వ్యాఖ్యలు!