Sapta Sagaralu Daati -Side B : ఓటీటీలోకి వచ్చేసిన ఫీల్ గుడ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కన్నడ హీరో రక్షిత్ శెట్టి 777 చార్లీ మూవీ తో దేశవ్యాప్తంగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నాడు.ఆ మూవీలో రక్షిత్ శెట్టి తన అద్భుతమైన నటనతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. ఆ తర్వాత సప్త సాగరాలు దాటి సైడ్ ఏ తో మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కన్నడలో విడుదలై సూపర్ హిట్ అందుకున్న ఈ మూవీ ఇటు తెలుగులో కూడా రిలీజ్ చేయగా మంచి విజయం సాధించింది.ఈ మూవీలో రుక్మిణీ వసంత్ హీరోయిన్ గా నటించగా.. హేమంత్ దర్శకత్వం వహించారు. సైడ్ ఎ చిత్రానికి సీక్వెల్ గా మేకర్స్ ‘సప్త సాగరాలు దాటి-సైడ్ బీ’ ను తీసుకువచ్చారు. గతేడాది నవంబర్ 17న రిలీజ్ అయిన సైడ్ బి మూవీ సూపర్ హిట్ అయ్యింది. కన్నడతో పాటు తెలుగు మరియు తమిళంలోనూ ఈ చిత్రానికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూశారు. ఈ క్రమంలో తాజాగా ఈ సూపర్ హిట్ మూవీ ఎలాంటి హడావిడి లేకుండా సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రస్తుతం ‘సప్త సాగరాలు దాటి-సైడ్ బీ’ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇటీవలే ఈ ఓటీటీ రిలీజ్ పై హీరో రక్షిత్ శెట్టి ట్వీట్ చేయగా.. ఇప్పుడు ఎలాంటి అనౌన్మెంట్ లేకుండానే స్ట్రీమింగ్ కు వచ్చేసింది..
అయితే ‘సప్త సాగరాలు దాటి-సైడ్ బీ’ కథ విషయానికి వస్తే..తన ప్రేయసి తో కలిసి సంతోషంగా జీవించాలని.. అందుకు డబ్బు ఉండాలని నిర్ణయించుకున్న హీరో.. చేయని తప్పుకు జైలుకు వెళ్తాడు. ఆ తర్వాత అనుహ్యంగా అదే కేసులో పదేళ్లపాటు జైలు శిక్ష అనుభవిస్తాడు. అలా పదేళ్ల తర్వాత బయటకు రావడంతో స్టోరీ స్టార్ట్ అవుతుంది. తన ప్రేయసి ప్రియ (రుక్మిణి వసంత్)కు పెళ్లి అయిపోయి ఉంటుంది. దీంతో ఆమెని మర్చిపోలేక మన సతమతం అవుతుంటాడు. ప్రియని దూరం నుంచి ఫాలో అవుతూ.. ఆమె కొడుకు మరియు భర్తతో తన గురించి చెప్పకుండా స్నేహం చేస్తాడు. ఆమెకు అన్ని విధాలా సాయం చేస్తుంటాడు. చివరకు తాను ప్రియను కలిశాడా ?.. అతని జీవితంలోకి వచ్చిన సురభి (చైత్ర జే ఆచార్) ఎవరు ? తనను జైలుకు పంపించిన వారిపై పగ తీర్చుకున్నాడా ? అనేది ఈ చిత్ర కథ.థియేటర్లలో ఎంతగానో అలరించిన ఈ మూవీ ఓటీటీ ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది. థియేటర్స్ లో మిస్ అయిన వారు ఇప్పుడు ఈ చిత్రాన్ని ఓటీటీ లో చూసి ఎంజాయ్ చేయవచ్చు.
Also Read
- Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
The Wait Is Over….. Finally Its Streaming Now On #AmazonPrime #SSESideB pic.twitter.com/7kBaPXgLcW
— Adheera (@adheeraeditz) January 25, 2024
తాజావార్తలు
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Trump vs Zelenskyy: జెలెన్స్కీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. ఉక్రెయిన్ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటూ సూచన!
-
PM Modi Chennai Visit Today: నేడు చెన్నైలో ప్రధాని మోడీ పర్యటన.. రూ.13,000 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం!
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!