Site icon NTV Telugu

Sapota Nutrition Facts : సపోటా పండు తింటే ఇన్ని లాభాలా..?

Sapota

Sapota

మనకు ప్రకృతి పరంగా సహజ సిద్ధంగా లభించే వాటిలో సపోటా అద్భుతమైన రుచిని అందించే పండ్లలో ఒకటి. ఇది అధిక పోషకాలు కలిగి ఉన్న పండు. ఈ పండు రుచికరమైన గుజ్జు వల్ల తేలిక గా జీర్ణమై గ్లూకోజ్‌ అధికంగా ఉండటం వల్ల శరీరానికి శక్తిని అందిస్తుంది. ఈ పండులో విటమిన్లు, మినరల్స్‌ సమృద్ధిగా ఉన్నాయి. దీని రుచి తీయగా ఉండటం వల్లనా షేక్స్‌లలో బాగా ఉపయోగిస్తుంటారు. ఇవే కాకుండా సపోటాలో వివిధ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో చూసేద్దాం.
Also Read : Motion sickness Tips : జర్నీల్లో వచ్చే వాంతులను తగ్గించే చిట్కాలు
సపోటా శరీరానికి తక్షణ శక్తిని ఇచ్చే గ్లూకోజ్‌ సమృద్ధిగా కలిగి ఉంటుంది. సపోటా విటమిన్‌-ఏ ను అధికంగా కలిగి ఉంటుంది. విటమిన్-ఏ వృద్ధాప్యంలో కూడా కంటి చూపును మెరుగుపరచడానికి సహాయపడుతుంది. అందువల్ల మంచి దృష్టిని పొందడానికి సపోటా పండు బాగా ఉపయోగపడుతుంది. సపోటా టన్నిన్‌ అధికంగా కలిగి ఉండటం వలన ముఖ్యమైన యాంటీ ఇన్‌ఫ్లామెంటరీ ఏజెంట్‌గా పనిచేస్తుంది. ఇది పేగు సోదము చికాకు పెట్టే పేగు వ్యాధి, పొట్టలో పుండ్లు వంటి వ్యాధుల నివారణ ద్వారా జీర్ణ వాహిక పరిస్థితిని మెరుగుపరచడానికి సహాయపడుతుంది.
Also Read : Border Dispute: కర్ణాటక-మహారాష్ట్ర సరిహద్దు వివాదం.. జెండా పట్టుకున్నందుకు తోటి విద్యార్థిపై దాడి

ఇది ఎటువంటి వాపు నైన నొప్పి నాయనా తగ్గించడం ద్వారా మంటను కూడా తగ్గిస్తుంది. ఇందులో ఉండే విటమిన్-ఏ,బీ శరీరంలోని శ్లేష్మ క్రమీకరణకు, చర్మం ఆరోగ్య నిర్మాణ నిర్వహణకు సహాయపడతాయి. సపోటాలోని యాంటీ ఆక్సిడెంట్‌లు, పీచు, పోషకాల కాన్సర్‌ నుంచి రక్షణ కల్పిస్తాయి. విటమిన్-ఏ, ఊపిరితిత్తులు, నోటి కాన్సర్‌ నుండి రక్షణ అందిస్తుంది. సపోటా పండు శక్తివంతమైన ఉపశమనకారి కావడం వలన నరాల ఉదృతి ని ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడుతుంది. అందువల్ల ఇది నిద్ర లేమి, ఆందోళన, వ్యాకులతతో బాధపడుతున్న వ్యక్తులకు మంచిది. ఇందులో పాలిఫెనాలిక్‌ అనే అమ్లా జలాలు ఉండడం వలన సపోటా పండ్లు అనేక యాంటీ వైరల్‌, యాంటీ పెరాసెటిక్‌ , యాంటీ బ్యాక్టీరియా లక్షణాలను కలిగి ఉంది.

Also Read : #SSMB28: ‘అ’నే నమ్మిన మాటల మాంత్రికుడు…
ఈ యాంట ఆక్సిడెంట్లు, బ్యాక్టీరియాను మన శరీరంలోకి ప్రవేశించకుండా నిరోధిస్తాయి. పోటాషియం, ఐరన్‌, ఫాలిక్‌, నియాసిన్ జీర్ణ వ్యవస్థకు సరైన చర్యలు అయితే విటమిన్స్‌ హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను నాశనం చేస్తుంది. సపోటా పండ్లు చర్మం కాంతివంతంగా ఉండటానికి సహాయపడుతుంది. ఈ పండులో ఉండే విటమిన్-ఈ చర్మాన్ని తేమగా ఉంచడం వలన చర్మం అందంగా, ఆరోగ్యంగా ఉంటుంది. అందువలన సపోటా పండ్లు తినడం అనేది చర్మానికి ఎంతో మంచిది. సపోటా విత్తనాలను ఆముదంతో కలిపి ఒక పేస్ట్‌ల తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి మరుసటి రోజు అంటే పూసుకున్న రోజు కాకుండా తర్వాత రోజు తల స్నానం చేయండి. దీని వలన మన జుట్టు మృదువుగా ఉండి చుండ్రు సమస్యను నివారిస్తుంది.

Exit mobile version