Site icon NTV Telugu

Hyderabad Police : సంతోష్ నగర్ ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్

Traffic Challan

Traffic Challan

Hyderabad Police : కొద్ది రోజులుగా సంతోష్ నగర్ ట్రాఫిక్ పోలీసులు రాంగ్ రూట్,వితౌట్ హెల్మెట్, మోడీఫైడ్ సైలెన్సర్, మల్టి టోన్ సైరన్, బ్లాక్ ఫిల్మ్,అనధికారిక స్టిక్కర్ వంటి వాటి పై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఈ రోజు సంతోష్ నగర్ ప్రధాన రహదారి పై ఇన్స్ స్పెక్టర్ నర్సింహా నాయక్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ పోలీసులు వాహనాలను తనిఖీ చేశారు. రాంగ్ రూట్ డ్రైవింగ్,హెల్మెట్ లేకుండా ఉన్న 167 కేసులు నమోదు చేశారు. సీటు బెల్ట్ పెట్టుకోని కారు డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మీడియా తో మాట్లాడుతూ..వాహనదారులు కచ్చితంగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించని వాహనదారుల పై చట్టపరమైన చర్యలు ఉంటాయని తెలిపారు. రాంగ్ రూట్ డ్రైవింగ్ వల్ల ప్రమాదాలు చోటుచేసుకుని కుటుంబాలు వీదిన పడిన సంఘటనలు చాలా ఉన్నాయని తెలిపారు. ఈ రోజు తనిఖీలలో ఓ వాహనానికి ఎమ్మెల్యే స్టికర్ పెట్టుకుని సైరన్ పెట్టుకొని వెల్లుతున్న రియల్ ఎస్టేట్ వ్యాపారి పై కేసు నమోదు చేశామని తెలిపారు. ఎవరు కూడా ఇలా సైరన్ ఉపయోగించి పబ్లిక్ ను భయబ్రాంతులకు గురి చేయొద్దని సూచించారు.

  Kejriwal: లిక్కర్ కేసులో ఎదురుదెబ్బ.. ట్రయిల్‌ కోర్టు విచారణపై స్టేకు హైకోర్టు నిరాకరణ

ఇదిలా ఉంటే.. సికింద్రాబాద్.. అంతరాష్ట్ర దొంగల ముఠా గుట్టురట్టు చేశారు సికింద్రాబాద్ జీఆర్పీ, ఆర్పీ ఎఫ్ పోలీసులు. హర్యానకు చెందిన రణ్వీర్ సింగ్ ను అరెస్ట్ చేసి అతడి నుండి 21లక్షల విలువైన 26నర తులాల బంగారం స్వాధీనం చేసుకొని రిమాండ్ కు తరలించినట్లు సికింద్రాబాద్ రైల్వే డీఎస్పీ జావేద్ తెలిపారు. ఢిల్లీలో డ్రైవర్‌గా పని చేస్తూ దొంగతనాలు ప్రవృత్తిగా మార్చుకున్న హర్యాణకు చెందిన రణ్వీర్ సింగ్ గతంలోనే డిల్లీ జీఆర్పీ, కర్ణాటక జీఆర్పీ పోలీసులు అరెస్ట్ చేయగా జైల్ శిక్ష అనుభవించినట్లు విచారణలో తేలిందని డీఎస్పీ పేర్కొన్నారు. హర్యానకే చెందిన మరో నలుగురు యువకులతో కలసి ముఠాగా ఏర్పడి సికింద్రాబాద్ జీఆర్పీ పరిదిలో ప్రయాణికుల నుండి బంగారు ఆభరణాల చోరీ. నాలుగు కేసులలో నిందితులుగా తేలినట్లు వెల్లడించారు.

Aaryavir Sehwag: ఇక దబిడి దిబిడే.. డబుల్ సెంచరితో రెచ్చిపోయిన వీరేంద్ర సెహ్వాగ్ కొడుకు

Exit mobile version