Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Santosh Banned In India But Hits Cannes Oscars Ott Release Date Announced

Santosh: ఇండియాలో బ్యాన్‌.. కానీ కేన్స్, ఆస్కార్‌ల దాకా దూసుకెళ్లిన క్రైమ్ మూవీ.. OTT రిలీజ్ డేట్ ఫిక్స్..

Published Date :October 9, 2025 , 1:58 pm
By Mounika
Santosh: ఇండియాలో బ్యాన్‌.. కానీ కేన్స్, ఆస్కార్‌ల దాకా దూసుకెళ్లిన క్రైమ్ మూవీ.. OTT రిలీజ్ డేట్ ఫిక్స్..
  • Follow Us :
  • google news
  • dailyhunt

సినిమాలు కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం కాదు, సమాజానికి అద్దం చూపే శక్తివంతమైన మీడియా. అలాంటి సినిమాల్లో ఒకటి ‘సంతోష్’. భారతదేశంలో ఈ సినిమాను బ్యాన్ చేసినప్పటికి, ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు దక్కించుకుంది. చెప్పాలంటే ఈ మూవీ 2025 జనవరి 10న విడుదల కావాల్సింది. కానీ ఈ సినిమాకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) క్లియర్ సర్టిఫికెట్ ఇవ్వలేదు. కారణం – సినిమాలో స్త్రీ ద్వేషం, కుల వివక్ష, ఇస్లామోఫోబియా, పోలీసుల దౌర్జన్యం వంటి అంశాలను దర్శకురాలు నేరుగా చూపించడం. ఈ అంశాలపై సెన్సార్ బోర్డు అనేక కట్స్ సూచించింది. అయితే దర్శకురాలు సంధ్యా సూరి “ఆ కట్స్ చేస్తే సినిమా ఆత్మనే కోల్పోతుంది” అని అంగీకరించలేదు. దీంతో సినిమా భారతదేశంలో విడుదల కాలేదు. ఈ నిర్ణయంపై ఆమె తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తూ, “ఇలాంటి విషయాలను చూపిన ఎన్నో సినిమాలు ఇంతకు ముందు వచ్చినా, ‘సంతోష్’ పై మాత్రం ఎందుకింత కఠినంగా వ్యవహరించారో అర్థం కాలేదు” అని వ్యాఖ్యానించారు.

Also Read : Shiva: రామ్‌ గోపాల్ వర్మ ఎవరో తెలియదు.. కానీ ‘శివ’ నా దృష్టి మార్చేసింది: శేఖర్ కమ్ముల

కథ ప్రకారం, షహానా గోస్వామి నటించిన సంతోష్ సైనీ పోలీస్ కానిస్టేబుల్ గా చేరి, ఒక దళిత యువతి రేప్ & మర్డర్ కేసును దర్యాప్తు చేస్తోంది . ఇన్‌స్పెక్టర్ సునీతా రజ్వార్ తో కలిసి సమాజంలోని అవినీతి, అధికార దౌర్జన్యాన్ని ఎదుర్కొంటుంది. 2012 ఢిల్లీ గ్యాంగ్ రేప్ ఘటన తర్వాత వచ్చిన సామాజిక ఉద్యమం కథకు ప్రేరణ అయ్యింది. ఇండియాలో అడ్డంకులు ఎదురైనా, ‘సంతోష్’ 77వ కేన్స్, 97వ ఆస్కార్ షార్ట్‌లిస్ట్, 78వ బాఫ్టా నామినేషన్ సాధించింది. షహానా గోస్వామి, సునీతా రాజ్వార్ నటన ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషించారు. కాగా తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ OTT విడుదలకు సిద్ధం అయింది. అక్టోబర్ 17న లయన్స్‌గేట్ ప్లే OTTలో రిలీజ్ అవుతోంది. మొత్తంగా, ‘సంతోష్’ కథా, సమాజ ప్రతిబింబం, అంతర్జాతీయ గుర్తింపు అన్ని కలిపి ప్రత్యేకంగా నిలిచిన ఈ చిత్రం అక్టోబర్ 17న OTT విడుదలతో కొత్త చర్చలకు నాంది పలుకనుంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Indian crime drama OTT
  • Lionsgate Play Santosh
  • Santosh Cannes film festival
  • Santosh movie banned India
  • Santosh movie controversy

తాజావార్తలు

  • Lakshmi Manchu: ఆ విషయంలో నా భర్త జంకుతాడు..

  • Tollywood : టాలీవుడ్ లో పైరసీ కలకలం.. ఫిలిం ఛాంబర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు

  • Rakasa : రాకాస ‘ప్రీ-రిలీజ్’ షాక్.. థియేట్రికల్ హక్కులకే అన్ని కోట్లా? నిహారిక క్రేజ్ మామూలుగా లేదు!

  • LPG Ship: తెలుగు రాష్ట్రాలకు శుభవార్త.. విశాఖ పోర్టుకు చేరుకున్న మరో భారీ ఎల్పీజీ నౌక!

  • Sonali Bendre: చిక్కుల్లో బాలీవుడ్ నటి సోనాలి బెంద్రే ఫ్యామిలీ.. సివిల్ కోర్టులో రైతు తీవ్ర ఆరోపణలు

ట్రెండింగ్‌

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions