NTV Telugu Site icon

Vadakupatti Ramasamy: సంతానం హీరోగా ‘వడక్కుపట్టి రామసామి’

Vadakupatti Ramasamy

Vadakupatti Ramasamy

Vadakupatti Ramasamy: ‘గూఢచారి’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రంతో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పలు అద్భుత విజయాలను సాధించింది. హిట్స్ సాధించి తెలుగు చిత్ర పరిశ్రమలోని ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ఒకటిగా ఎదిగింది. విట్ నెస్, సాల వంటి చిత్రాలను నిర్మించడం ద్వారా తమిళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి అక్కడా కూడా తనదైన ముద్ర వేసింది. ఇప్పుడు ‘వడక్కుపట్టి రామసామి’ పేరుతో తమిళంలో మూడో చిత్రానికి శ్రీకారం చుట్టింది. ఈ చిత్రం కోసం ‘డిక్కిలోన’తో బ్లాక్ బస్టర్ జోడీగా పేరు తెచ్చుకున్న నటుడు సంతానం, దర్శకుడు కార్తీక్ యోగితో మరోసారి చేతులు కలిపారు. జాన్ విజయ్, ఎంఎస్ భాస్కర్, రవి మరియ, మారన్, మొట్టా రాజేంద్రన్, నిజల్గల్ రవి, శేషు, ప్రశాంత్, జాక్వెలిన్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించనున్నారు.

సీన్‌ రోల్డాన్‌ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ‘విట్ నెస్’ చిత్రంతో దర్శకుడిగా, సినిమాటోగ్రాఫర్‌గా విమర్శకుల ప్రశంసలు అందుకున్న దీపక్ ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. ఎడిటర్‌గా శివ నందీశ్వరన్, ఆర్ట్ డైరెక్టర్‌గారాజేష్, కొరియోగ్రాఫర్‌గా షరీఫ్ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో టి.జి.విశ్వప్రసాద్, కో-ప్రొడ్యూసర్ వివేక్ కూచిబొట్ల వంటి దూరదృష్టిగల నిర్మాతలు ఉన్నారని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ క్రియేటివ్ ప్రొడ్యూసర్ వి. శ్రీనటరాజ్ అన్నారు. వీరు తెలుగులో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే అద్భుతమైన చిత్రాలను అందించారన్నారు. మేము తమిళ సినిమాలను నిర్మించాలని నిర్ణయించుకున్నప్పుడు, మంచి కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లను అందించాలనుకున్నామని వెల్లడించారు.

ఎలాంటి జోనర్‌లోనైనా ఒదిగిపోయి అలరించగల నటుడు సంతానంతో కలిసి పనిచేయడానికి ఆసక్తిగా ఉన్నామని ఆయన నటరాజ్ పేర్కొన్నారు. అనుకోకుండా అతను నటించిన ‘డిక్కిలోన’ సినిమా చూసి.. చిత్ర దర్శకుడు కార్తీక్ యోగిని కలిశామని, ఆయన తమకు ఒక అద్భుతమైన కథను చెప్పారని తెలిపారు. వడకుపట్టి రామసామి ప్రముఖ నటుడు గౌండమణి ప్రసిద్ధ పాత్రలలో ఒకదానిపై ఆధారపడి ఉంటుందన్నారు. ఇది ప్రస్తుతం అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో మీమ్ మెటీరియల్‌గా మారిందన్నారు. కార్తీక్ కథ చెప్పినప్పుడు సినిమా సారాంశం, కథానాయకుడి పాత్ర చక్కగా కుదిరాయని అనిపించిందన్నారు.

Waltair Veerayya: పది రోజులైనా తగ్గేదేలే.. డబుల్ సెంచరీ కొట్టిన ‘వాల్తేరు వీరయ్య’

రామసామి అనే పేరు మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా మాట్లాడే ప్రతీక అయినందున అందులో చాలా పొరలు దాగి ఉంటాయని ఆయన చెప్పారు. అన్నింటికంటే ముఖ్యంగా దర్శకుడు కార్తీక్.. గౌండమణికి వీరాభిమాని అని తెలిపారు. అతని మునుపటి చిత్రం ‘డిక్కిలోన’ కూడా ప్రముఖ నటుడి కామెడీ లైన్‌ల నుండి ప్రేరణ పొందిందన్నారు. పీరియడ్ కామెడీ-డ్రామాగా తెరకెక్కనున్న వడకుపట్టి రామసామి తనదైన శైలిలో ప్రేక్షకులను అలరిస్తుందని మేము బలంగా నమ్ముతున్నామన్నారు.

చిత్రానికి సంబంధించి పేరుతో కూడిన ప్రచారచిత్రం విడుదల చేసిన నిర్మాతలు.. పూజా కార్యక్రమాలతో ఈ చిత్రం షూటింగ్ రేపు(జనవరి 24న) ప్రారంభం కానుందని తెలిపారు. ఈ చిత్రాన్ని వేసవిలో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

Show comments