NTV Telugu Site icon

Sankranti Holidays: ఏపీలో నేటి నుంచి సంక్రాంతి సెలవులు

Ap

Ap

Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం సంక్రాంతి సెలవులు ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ్టి నుంచి స్కూళ్లు, కాలేజీలకు సెలవుల ఇస్తున్నట్లు పేర్కొనింది. ఆంధ్ర ప్రదేశ్ లోని అన్ని స్కూళ్లకు 10 రోజుల పాటు హాలీడేస్ ఇచ్చింది. సెలవు రోజుల్లో తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్ని స్కూళ్లను విద్యాశాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అయితే.. రాష్ట్రంలో సంక్రాంతి సెలవుల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. వాస్తవానికి జనవరి 16 వరకూ సెలవులుంటాయని ప్రకటించారు.. కానీ ఆ తరువాత మార్పులు చేసిన సర్కార్.. ఈ నెల 9వ తేదీ నుంచి 18వ తేదీ వరకూ రాష్ట్రంలో అన్ని స్కూళ్లకు పది రోజుల పాటు హాలీడేస్ ఇచ్చింది. తిరిగి 19వ తేదీన స్కూళ్లు పునఃప్రారంభం అవుతాయని తెలిపింది.

Read Also: Gold Price Today : పసిడి ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం.. ఎంతంటే?

ఇక, ఈసారి జనవరి 13 రెండవ శనివారం, 14వ తేదీ భోగి పండుగ, జనవరి 15న సంక్రాంతి పండుగలున్నాయి. రెండ్రోజులు సాధారణ పబ్లిక్ సెలవులు రావడంతో 18వ తేదీ వరకూ సెలవులు పొడిగించినట్టు ప్రభుత్వం తెలిపింది. ఇక కాలేజీలకు జనవరి 11వ తేదీ నుంచి 17వ తేదీ వరకు సెలవులు ఉన్నాయి. అలాగే, మరోవైపు తెలంగాణలో కూడా జనవరి 12 నుంచి 17వ తేదీ వరకు స్కూళ్లకు హాలీడేస్ ను ప్రభుత్వం ఇచ్చింది. ఈ క్రమంలోనే మిషనరీ స్కూళ్లకు మినహా అన్ని స్కూళ్లకు ఈ సెలవులు వర్తిస్తాయని స్పష్టం చేసింది. కాలేజీలకు మాత్రం 13వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ఈ సెలవులను తెలంగాణ ఇంటర్మిడియట్ బోర్డ్ ప్రకటించింది.