NTV Telugu Site icon

MATA: కెనడాలో అంబరాన్నంటిన సంక్రాంతి సంబరాలు

Canada

Canada

MATA: విదేశాల్లో తెలుగు వారు అత్యంత ఘ‌నంగా సంక్రాంతి వేడుకలు జ‌రుపుకుంటున్నారు. కెనడాలోని నోవస్కోటియా ప్రావిన్స్‌లోని హాలీఫ్యాక్స్‌ నగరంలో మారీటైమ్‌ తెలుగు అసోసియేషన్‌(MATA) ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి సంబురాలు అంబ‌రాన్నంటాయి. ఈ సందర్భంగా వివిధ సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, గోవా, పశ్చిమ బెంగాల్‌ సహా దేశంలోని వివిధ రాష్ట్రాల మ‌హిళ‌లు త‌మ‌ సంస్కృతీ సంప్రదాయాలు ప్రతిబింబించేలా ఫ్యాషన్‌ షో నిర్వహించారు. ఈ సందర్భంగా 2023 తెలుగు క్యాలెండర్‌ను నిర్వాహకులు ఆవిష్కరించారు.