Site icon NTV Telugu

Sankranthiki Vasthunnam : ‘సంక్రాంతికి వస్తున్నాం’ 2 కి లైన్ క్లియర్!

Sankrathiki Osthunam Part 2

Sankrathiki Osthunam Part 2

విక్టరీ వెంకటేష్ నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించింది. 2025 సంక్రాంతి రేసులో నిలిచిన ఈ చిత్రం ఏకంగా 300 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి వెంకీ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ భారీ విజయం అందించిన ఉత్సాహంతో, ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌ను తెరకెక్కించేందుకు నిర్మాతలు రంగం సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్‌లో నటిస్తున్న వెంకటేష్, ఆ ప్రాజెక్ట్ పూర్తికాగానే అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ సీక్వెల్‌ను పట్టాలెక్కించనున్నారు. వచ్చే ఏడాది జూన్ నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉందట.

Also Read : Ranbir – Alia Bhatt : ఇటలీ ఫర్నిచర్ నుండి టెర్రస్ గార్డెన్ వరకు.. రణబీర్–అలియా లగ్జరీ హోమ్ స్పెషల్స్

ఈ సీక్వెల్ విడుదలపై కూడా చిత్ర యూనిట్ ఒక స్పష్టమైన క్లారిటీతో ఉన్నట్లు తెలుస్తోంది. 2027 సంక్రాంతి కానుకగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. మొదటి భాగంలో వెంకటేష్ మార్క్ కామెడీ, అనిల్ రావిపూడి టేకింగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ సీక్వెల్‌లో కూడా అదే మ్యాజిక్ రిపీట్ అవుతుందని మేకర్స్ ధీమాగా ఉన్నారు. ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరిలతో పాటు సీక్వెల్‌లో మరో కొత్త హీరోయిన్ కూడా భాగం అయ్యే అవకాశం ఉందట. ఈ సినిమాతో వెంకీ సంక్రాంతి సెంటిమెంట్‌ను మరోసారి క్యాష్ చేయబోతున్నారనమాట.

Exit mobile version