NTV Telugu Site icon

Sankrantiki Vastunnam : “సంక్రాంతికి వస్తున్నాం” ట్రెండ్ కూడా గట్టిగానే ఉందే

Sankranthiki Vasthunam

Sankranthiki Vasthunam

Sankrantiki Vastunnam : సంక్రాంతి బరిలో ఉన్న చిత్రాలలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ ఒకటి. వెంకటేష్ హీరోగా, అనిల్ రావిపూడి కాంబినేషన్ తో తెరకెక్కిన ఈ మూవీ జనవరి 14 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు , శిరీష్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన పాటలు, ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి సాలిడ్ రెస్పాన్స్ లభించగా, విడుదల సమయం దగ్గర పడుతుండడంతో ప్రమోషన్ లు కూడా జోరుగా చేస్తున్నారు మూవీ టీం.

Read Also:Mahakumbh 2025 : మహా కుంభమేళాలో స్పెషల్ అట్రాక్షన్ నాగసాధువులు… వాళ్లు ఎన్ని రకాల అలంకారాలు ధరిస్తారో తెలుసా ?

ఈ సంక్రాంతి కానుకగా ప్లాన్ చేసిన చిత్రాల్లో రెండు ఆల్రెడీ విడుదల అయ్యాయి. ఇక ఈ చిత్రాలు తర్వాత “సంక్రాంతికి వస్తున్నాం” సినిమా జనవరి 14న రిలీజ్ కాబోతుంది. కాగా సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఇప్పటికే పాటలు, ట్రైలర్ లతో మళ్ళీ అనీల్ రావిపూడి మార్క్ ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నట్లు అర్థం అవుతుంది. దీనితో ఈ సినిమాపై మంచి హైప్ నెలకొనగా ఇపుడు సినీ వర్గాల్లో అయితే ఈ చిత్రానికి భారీ ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వెంకటేష్ గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమాకి బుకింగ్స్ మరింత స్ట్రాంగ్ గా కనిపిస్తుండగా వీటితో సంక్రాంతి కానుకగా వస్తున్న ఈ సినిమాకి కూడా గట్టి ఓపెనింగ్స్ ఖచ్చితంగా ఉంటాయని తెలుస్తుంది. మరి ఈ అవైటెడ్ సినిమాకి తెలుగు ఆడియెన్స్ ఎలాంటి నంబర్స్ అందిస్తారో చూడాలి.

Read Also:Chittoor: తీవ్ర విషాదం.. పిల్లలతో సహా తల్లి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నం

ఇదిలా ఉంటే ఈ సినిమా రన్‌టైమ్‌ను మేకర్స్ లాక్ చేశారు. మొత్తం 2 గంటల 22 నిమిషాల షార్ప్ రన్ టైమ్ ఫిక్స్ చేశారట మేకర్స్. కమర్షియల్ చిత్రానికి ఇది పర్ఫెక్ట్ రన్‌టైమ్ అని చెప్పోచ్చో. ఇక అనిల్ రావిపూడి మూవీ అంటే కామెడి మాములుగా ఉండదు ఆడియెన్స్‌కు ఏమాత్రం బోర్ కొట్టకుండా కంటెంట్ ఉన్న మూవీ బ్లాక్ బస్టర్ అవ్వడం ఖాయం. కానీ ఈ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా మరో రెండు సినిమాలతో పోటీ పడుతుండటంతో ఈ మూవీకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందా అని వెంకిమామ అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు.

Show comments