NTV Telugu Site icon

Sanju Samson: ఐపీఎల్‌కు ముందు రాజస్థాన్‌కు భారీ దెబ్బ.. శాంసన్‌కు గాయం

Sanju Samson

Sanju Samson

ఐపీఎల్‌ 2025 సీజన్‌ ప్రారంభానికి ముందు రాజస్థాన్‌ రాయల్స్‌కు భారీ దెబ్బ తగిలింది. ఆ జట్టు కెప్టెన్‌ సంజూ శాంసన్‌ గాయపడ్డాడు. ఇంగ్లండ్‌తో ఐదో టీ20లో సంజూ చూపుడు వేలికి గాయమైంది. జోఫ్రా ఆర్చర్‌ వేసిన బౌలింగ్‌లో బంతి సంజూ చూపుడు వేలుపై బలంగా తాకింది. ఈ క్రమంలో ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌లో సంజూ కీపింగ్ చేయలేదు. అతని స్థానంలో ద్రువ్‌ జురెల్‌ వికెట్‌కీపింగ్‌ చేశాడు. పలు నివేదికల ప్రకారం.. సంజూ రానున్న ఆరు వారాలు క్రికెట్‌కు దూరంగా ఉంటాడని తెలుస్తుంది.

Read Also: Hezbollah: ఫిబ్రవరి 23న హిజ్బుల్లా అగ్రనేత హసన్ నస్రల్లా అంత్యక్రియలు..

ప్రస్తుతం సంజు శాంసన్ తిరువనంతపురంలోని తన ఇంటికి వెళ్లినట్లు తెలుస్తోంది. నేషనల్ క్రికెట్ అకాడమీలో రిహాబిలిటేషన్‌ పూర్తయిన తర్వాతే అతను తిరిగి ప్రాక్టీస్ మొదలుపెట్టనున్నాడు. ఈ క్రమంలో.. ఫిబ్రవరి 8 నుంచి 12 వరకు పుణెలో జరిగే రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్స్‌లో కేరళ, జమ్మూ కాశ్మీర్‌తో ఆడనుంది. అయితే గాయం కారణంగా ఆ మ్యాచ్ లో ఆడటం కష్టమే.. కాగా, శాంసన్ తిరిగి ఐపీఎల్‌ 2025 సీజన్‌తో పునరాగమనం చేసే అవకాశాలున్నట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి.

Read Also: Maha Kumbh Mela: వసంత పంచమి ఎఫెక్ట్.. ఒక్కరోజే 2 కోట్ల మంది స్నానాలు

ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో సంజూ శాంసన్‌ మరోసారి ఘోర విఫలమయ్యాడు. ఈ సిరీస్‌లో అతను కేవలం 51 పరుగులు (26,5,3,1,16) మాత్రమే చేశాడు. ఇంగ్లాండ్ బౌలర్లు వేసిన షార్ట్‌ పిచ్‌ బంతులకు ఔటయ్యాడు. మరోవైపు.. ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో శాంసన్ జట్టులో లేడు. ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపికైన జట్టులో కూడా శాంసన్ లేడు.