NTV Telugu Site icon

300 sixes Sanju Samson: సంజు ఖాతాలో స్పెషల్ ట్రిపుల్ సెంచరీ..

300 Sixes Sanju Samson

300 Sixes Sanju Samson

300 sixes Sanju Samson: తాజాగా టీమిండియా జింబాబ్వే పర్యటనను విజయవంతంగా పూర్తి చేసింది. భారత్ జింబాబ్వే మధ్య జరిగిన ద్వైపాక్షిక టి20 సిరీస్ లో మొత్తం ఐదు మ్యాచ్లు జరగగా టీమిండియా 4 – 1 తో సిరీస్ ను కైవసం చేసుకుంది. అన్ని మ్యాచ్లు జింబాబ్వేలోని హరారే స్పోర్ట్స్ క్లబ్ లో జరిగాయి. ఆదివారం నాడు జరిగిన 5వ చివరి టి20 మ్యాచ్ లో మొదట టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టింది టీంఇండియా. ఈ మ్యాచ్లో మొదటి ఇన్నింగ్స్ లో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 167 పరుగులను సాధించింది. ఇక ఈ సిరీస్లో అంతగా అవకాశం రాని సంజు శాంసన్ ఈ మ్యాచ్ లో రెచ్చిపోయాడు. దూకుడు మంత్రం ప్రదర్శించి అర్ధ సెంచరీ సాధించాడు. అంతేకాదు మ్యాచ్లో ఓ సిక్సర్ ఏకంగా 110 మీటర్లు కొట్టి తన పవర్ స్ట్రోక్ ఏంటో మరోసారి చూపించాడు.

Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

అయితే భారీ శిక్షను కొట్టిన సంజు శాంసన్ మరో ఘనతను సాధించాడు. ఈ భారీ సిక్సర్ తోనే సంజు టి20 కెరియర్లో 300 సిక్సర్ లను పూర్తి చేశాడు. ఇలా ఇప్పటివరకు తన టి20 కెరియర్ లో 302 సిక్సర్లు కొట్టాడు. ఈ మ్యాచ్ లో సంజు శాంసన్ కేవలం 39 బంతులలోనే అర్ధ సెంచరీని పూర్తిచేసి మొత్తంగా 45 బంతుల్లో 58 పరుగులను చేశాడు. ఈన్నింగ్స్ లో సంజు శాంసన్ ఒక ఫోర్, నాలుగు సిక్సర్లు సహాయంతో అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఇది సంజు శాంసన్ కు టి20 కెరియర్ లో రెండో అర్ధ సెంచరీ. ఇదే మ్యాచ్లో మరో టీమిండియా బ్యాట్స్మెన్ రియాన్ పరాగ్ 107 మీటర్ల భారీ సిక్స్ ను బాదాడు.

Arunachalam: టీజీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్.. జులై 19 నుంచి అరుణాచలానికి ప్రత్యేక బస్సులు..

ఈ మ్యాచ్లో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది టీమిండియా. టీమిండియా ఇన్నింగ్స్ లో కెప్టెన్ గిల్ 13 , ఎస్ఎస్వి జైస్వాల్ 12 , అభిషేక్ శర్మ 14 పరుగులతో వెనుతిరగగా ఆ తర్వాత శివం దూబే, రియాన్ పరాగ్, సంజు శాంసన్ లు స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. ఇక 168 పరుగుల టార్గెట్ చేసేందుకు వచ్చిన జుంబాబ్వే కేవలం 125 పరుగులకే కుప్పకూలింది. దీంతో 42 పరుగుల భారీ విజయాన్ని టీమిండియా అందుకుంది.