Site icon NTV Telugu

India vs England: సెమీఫైనల్లో సంజు శాంసన్ విశ్వరూపం.. సెంచరీ చేజారిన చెరిగిపోని రికార్డు!

Sanju Samson

Sanju Samson

India vs England: వెస్టిండీస్‌తో జరిగిన సూపర్-8 మ్యాచ్‌లో 97 పరుగులతో అజేయంగా నిలిచి భారత్‌కు సెమీఫైనల్ టికెట్ అందించిన సంజు శాంసన్, ఇప్పుడు ఇంగ్లాండ్‌తో జరిగిన సెమీఫైనల్‌లోనూ అదే ఫామ్‌ను కొనసాగించాడు. “తర్వాత ఏమిటి?” అని ప్రశ్నించిన విమర్శకులకు తన బ్యాట్‌తోనే సమాధానం ఇచ్చాడు. కేవలం 11 పరుగుల దూరంలో సెంచరీ చేజారినప్పటికీ, అతను ఆడిన 89 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ టీమిండియా చరిత్రలో నిలిచిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

READ ALSO: India vs England: రఫ్ఫాడించిన సంజు, దూబే.. ఇంగ్లాండ్ ముందు భారీ టార్గెట్

ఇంగ్లాండ్ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ 89 పరుగులు..
ఇంగ్లాండ్ బౌలర్లను ఊచకోత కోస్తూ సంజు శాంసన్ కేవలం 42 బంతుల్లో 89 పరుగులు సాధించాడు. ఇందులో 8 ఫోర్లు, 7 భారీ సిక్సర్లు ఉన్నాయి. 211.90 స్ట్రైక్ రేట్‌తో సాగిన ఈ ఇన్నింగ్స్ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసింది. టీ20 ఇంటర్నేషనల్ కెరీర్‌లో సంజుకు ఇది 5వ హాఫ్ సెంచరీ కాగా, ఈ వరల్డ్ కప్‌లో వరుసగా రెండో భారీ స్కోరు. ఈ టోర్నీలో సంజు శాంసన్ గణాంకాలు చూస్తుంటే కళ్లు చెదిరిపోతున్నాయి. ఇప్పటివరకు ఆడిన 4 ఇన్నింగ్స్‌ల్లో 232 పరుగులు చేశాడు. 77.33 సగటుతో భారత్ తరపున అత్యధిక సగటు కలిగిన బ్యాటర్‌గా నిలిచాడు. 201.73 స్ట్రైక్ రేట్‌తో టోర్నీలోనే అత్యంత వేగంగా పరుగులు చేస్తున్న ఇండియన్ బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. ఈ వరల్డ్ కప్‌లో ఇప్పటివరకు 16 సిక్సర్లు బాది, భారత్ తరపున ‘మోస్ట్ సిక్స్ హిట్టర్’గా నిలిచాడు. సెమీఫైనల్లో 89 పరుగుల వద్ద అవుట్ అవ్వడంతో తృటిలో నాలుగో సెంచరీ మిస్ అయినప్పటికీ, సంజు శాంసన్ ఆడిన ఈ నాక్ టీమిండియాకు బలమైన స్కోర్‌ను అందించడంలో విశేషంగా సహాయపడిందని విశ్లేషకులు చెబుతున్నారు.

READ ALSO: Bellamkonda Sai Sreenivas: ఈ వారమే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్థం.. పెళ్లికొడుకు కాబోతున్న అల్లుడు శీను!

Exit mobile version